
station ghanpur news e69news telugu news local news
నేషనల్ సేవా రత్నా అవార్డు కు జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ కు చెందిన కొలిపాక సతీష్ ఎంపికైనట్లు బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్లా రాధ కృష్ణ హైదరాబాద్ లోని వారి కార్యాలయంలో ప్రకటించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..సతీష్ చేసిన సేవా కార్యక్రమాలు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి మరియు వారి తల్లి సరోజన జ్ఞాపకార్థం మరియు ఆపదలో ఉన్నవారికి రక్తదానం.వారి పిల్లల జన్మ దినం సందర్భంగా అన్నదాన కార్యక్రమం.యాచకులకు దుప్పట్లు పంపిణీ.వైఎస్ మరియు వారి తల్లి జ్ఞాపకార్థం తల్లి దండ్రులు లేని పిల్లలకు మరియు నిరుపేద విద్యార్థులకు స్కూల్ ఫీజు కట్టడం.హాస్పిటల్ నిరుపేద వారికి తనకు తోచిన విధంగా డబ్బులు ఇవ్వడం. కరోనా టైంలో మాస్కులు పంపిణీ,చెట్లు నాటడం.పేద కుటుంబాలు చనిపోయిన వారికి బియ్యం పంపిణీ చేయడం అనేక సామాజిక కార్యక్రమాలను గుర్తించి అవార్డుకు ఎంపిక చేశామని తెలిపారు.జాతీయ సేవా అవార్డును వచ్చే నెల 11వ తారీకు నాడు తిరుపతి లో అవార్డును ప్రదానం చేస్తామని తెలిపారు.ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర అద్యక్షులు.గౌతమ్.రాష్ట్ర కొ ఆర్డినేటర్ విష్ణు.రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.విజయ్ కుమార్.సెలక్షన్ కమిటీ అధ్యక్షులు తాటికంటి ఐలయ్య.డాక్టర్ విజయ లలిత.నాయీ బ్రాహ్మణ రాష్ట్ర ఉపాధ్యక్షులు సమ్మయ్య పాల్గొన్నారు.