
ayodhya ram bhadradri ram badrachal news local news telugu daily e69 news
భద్రాద్రి రామయ్య సన్నిధిలో విశ్వరూప సేవ మహోత్సవం జరగుతోంది. గత నెల 13 నుంచి ప్రారంభమైన శ్రీ వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా అన్ని ఉత్సవాలు పూర్తయిన అనంతరం చివరి రోజు ఈ ఉత్సవాన్ని ఆలయ అధికారులు, అర్చకులు ప్రతి ఏడాది వైభవంగా నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 13 నుంచి డిసెంబర్ 21 వరకు పగలుపత్తు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. డిసెంబర్ 22న పవిత్ర గోదావరి నదిలో తెప్పోత్సవం వేడుక, 23 తెల్లవారుజామున ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం వేడుకలు ఘనంగా నిర్వహించారు. డిసెంబర్ 23 నుంచి జనవరి 6 వరకు రాపత్తు ఉత్సవాలు ఘనంగా పూర్తి చేశారు. ఉత్సవాలలో చివరి పెద్దదైన సర్వదేవతారాధన ఉత్సవాన్ని ఇవాళ నిర్వహిస్తోన్నారు. ఇన్ని రోజులు వివిధ అలంకారణలో భక్తులకు దర్శనమిచ్చిన అన్ని దేవతామూర్తులను ఒక వేదిక వద్దకు చేర్చి ఆలయ అర్చకులు విశేష పూజలు నిర్వహిస్తున్నారు. విశ్వరూప సేవకు ఆలయ బేడా మండపం వద్ద ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విశేష భక్త సందోహం నడుమ అర్చకులు సర్వదేవతలకు విశేష పూజలు నిర్వహిస్తున్నారు. ఏడాదికి ఒకసారి మాత్రమే నిర్వహించే ఉత్సవంలో స్వామివారికి కదంబం ప్రసాదాన్ని ఆలయ అర్చకులు విశేషంగా నివేదన చేస్తున్నారు. బియ్యం అన్ని రకాల కూరగాయలు నెయ్యి కలిపి ప్రత్యేకంగా ఈ ప్రసాదాన్ని తయారుచేసి స్వామివారికి నివేదిస్తున్నారు.