
sathupalli news local news galam news e69news
సత్తుపల్లిలోని క్యాంపు కార్యాలయంలో విద్యార్థినికి ల్యాబ్ ట్యాబ్ ను అందజేసిన సండ్ర వెంకట వీరయ్య సత్తుపల్లి మండలం, గంగారం గ్రామానికి చెందిన రాచమల్ల రవికుమార్ నాగమణి దంపతుల కుమార్తె రాజమళ్ళ భవ్యశ్రీ ఫ్యాషన్ డిజైనింగ్ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ విభాగంలో 62 ర్యాంకుతో జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం సీటు సాధించగా తన ఉన్నత విద్య కోసం ల్యాబ్ టాబ్ ను అందించాలని రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి కోరగా, ఏర్పాటుచేసిన ల్యాబ్ ట్యాబ్ ను సండ్ర వెంకట వీరయ్య సత్తుపల్లిలోని క్యాంపు కార్యాలయంలో విద్యార్థిని రాచమల్ల భవ్యశ్రీ కి అందజేశారు. పుట్టిన ప్రాంతానికి సేవ చేయలని సంకల్పంతో రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు విద్యార్థులకు చేయూతగా సేవా కార్యక్రమాలతో అండగా నిలుస్తున్నారని వారి సేవా కార్యక్రమాలకు సండ్ర వెంకట వీరయ్య గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ల్యాప్ టాబ్ ను అందజేసి విద్యార్థికి శుభాకాంక్షలు తెలిపి రానున్న కాలంలో ఉన్నత విద్యలో మరెన్నో విజయాలు సాధించాలని ఆమెని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు యాగంటి శ్రీనివాసరావు, మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు దొడ్డ శంకరరావు, సత్తుపల్లి టౌన్ బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మల్లూరి అంకమరాజు, గోగులముడి బాలాజి రెడ్డి, పట్టణ సోషల్ మీడియా అద్యక్షులు పర్వతనేని వేణు, కొప్పుల అవినాష్, గరిడేపల్లి వెంకీ తదితులున్నారు.