
kanki padu news local news telugu galam news e69news muslim news
అంతర్జాతీయ అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ ఆధ్వర్యంలో కంకిపాడు మండలం కుందేరు గ్రామంలో ధార్మిక శిక్షణ తరగతులు నిర్వహించారు.ఈ సందర్భంగా బాల,బాలికలకు ఖురాన్ పఠనము మరియు ఇస్లామ్ చరిత్ర,ధార్మిక విషయాల,ఆచరణ పద్ధతుల పట్ల అవగాహన కల్పించారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కృష్ణా జిల్లా ఇన్చార్జి మౌల్వీ ఉస్మాన్ మాట్లాడుతూ..ఇస్లాం విద్యను పూర్తిగా అనుసరించినట్లయితే ప్రాపాంచికంలోని ప్రతీ రంగంలో కూడా విజయం సాధించగలుగుతారని అన్నారు.భట్లపెనుమర్రు గ్రామ మౌల్వి మహమ్మద్ యాకుబ్ పాషా మాట్లాడుతూ..నేటి బాలలే రేపటి పౌరులని మరియు ప్రపంచంలో ఎక్కువగా పిల్లలు చెడు మార్గం వైపు ఆకర్షితులవుతున్నారని,కావున చెడు అలవాట్లను దూరం చేసుకుంటూ సరైన మార్గాన్ని ఎంచుకోవాలని కోరారు.ఈ యొక్క శిక్షణ తరగతులలో వివిధ గ్రామాల అహ్మదీయ మౌల్వీలు బాల బాలికలు గ్రామ అహ్మదీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.