
zaffergadh news telugu daily news e69news telugu galam news
-జువారి రమేష్
ప్రభుత్వ భూమిని ఆక్రమించిన జఫర్ఘడ్ సర్పంచ్ పై చట్ట పరమైన చర్య తీసుకోవాలి-సిపిఐ నియోజక వర్గ కార్యదర్శి జువారి రమేష్
గళం న్యూస్ జఫర్ఘడ్
రెవెన్యూ అధికారుల అండదండలతో ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని సిపిఐ పార్టీ స్టేషన్ ఘనపూర్ నియోజక వర్గ కార్యదర్శి జువారి రమేష్ ఆరోపించారు.జనగామ జిల్లా జఫర్ఘడ్ మండల కేంద్రంలోని 1645 సర్వే నెంబర్లు రెండున్నర ఎకరాల ప్రభుత్వ భూమినీ స్థానిక సర్పంచ్ బల్లెపు నర్సింగరావు గత ఐదు సంవత్సరాల క్రితం ఆక్రమించుకుని సాగు చేసుకుంటుండగా పలువురు గ్రామ పెద్దలు ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేయగా బుధవారం ప్రభుత్వ అధికారి ఐన డీఐ మాచర్ల రాజు స్పందించి ఫీల్డ్ మీదికి వచ్చి సర్వే చేయించి జప్తు చేసుకుని హద్జురాళ్ళు వేశారు.ఈ సందర్భంగా
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో స్థానిక యూత్ నాయకులను కలుపుకొని ఆక్రమిత భూమిని సందర్శించారు.అనంతరం పార్టీ నియోజకవర్గ కార్యదర్శి జువారి రమేష్ మాట్లాడుతూ..జిల్లాలో గత ప్రభుత్వంలో రాజకీయ నాయకులు,ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికారులతో,రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై ప్రభుత్వ భూములు ఎక్కడ ఉంటే అక్కడ ఆక్రమించుకున్నారని ఆరోపించారు.నిందితుడైన జఫర్ఘడ్ సర్పంచ్ పైన తక్షణమే చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఆక్రమణకు గురైన స్థలంలో పేదలకు ఇండ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో ఎర్రజెండాలు నాటి భూ పోరాటం నిర్వహించి పేదలకు పంచుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు చంద్రమౌళి ఎండి యాకుపాషా ముసలయ్య పెండ్యాల సమ్మయ్య ఎండి ఖలీల్ చంటి తాడెం కుమార్ తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు.