
telugu galam news e69news local news daily news today news
కల్లూరు మండలం కప్పలబంధం మరియు తల్లాడ మండలం కొత్త వెంకటగిరి గ్రామాలలో అహ్మదియ్య ముస్లిం సంఘం మహిళల విభాగం (లజ్న ఇమాఇల్లాహ్) ఆధ్వర్యంలో నిరుపేదలకు మరియు వృద్దులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా అధ్యక్షులు షేక్ హుస్సేన్ సాహెబ్,జిల్లా ఇంఛార్జి ముహమ్మద్ అక్బర్, ఉపాధ్యక్షులు షేఖ్ మహబూబ్ సాహెబ్ మరియు గ్రామ సర్పంచ్ సతీమణి నందిగం మర్యమ్మ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ముహమ్మద్ అక్బర్ మాట్లాడుతూ అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ ఇంటర్నేషనల్ అధినేత హజ్రత్ మిర్జా మస్రూర్ ఆహ్మద్ సారధ్యంలో ధార్మిక కార్యక్రమాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నదని తెలిపారు.అందులో భాగంగానే మానవ సేవే మాధవ సేవ అన్నట్లు ప్రజలకు మేలు చేసినప్పుడే దేవుడు కూడా సంతోషిస్తాడనే భావంతో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నదని అన్నారు.మానవులందరు మత సామరస్యతను కాపాడుటకు కృషి చేయవలెనని హితవు పలికారు.తదనంతరం గ్రామ సర్పంచ్ సతీమణి మరియు స్థానిక జమాత్ మహిళా అధ్యక్షురాలు సుభ్హాన్ బీ చేతుల మీదుగా దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జరీనా,సైదాబి,హుస్సేన్ బీ,రంజాన్ బీ,కాసిమ్ బీ, మహబూబ్ బీ,బేగం బీ అదే విధంగా స్థానిక అహ్మదీయ అధ్యక్షుడు ఉద్ధండు సాహెబ్,ఉపాధ్యక్షులు బాబుమియా సాహెబ్ మరియు మొల్వి సాహెబ్ షేక్ బాబర్ అహ్మద్ వసీమ ఆరిఫ్,మహబూబ్ బీ, కాసింబీ, హసీనా,సకీనా, మొగ్లాబి,దర్గాబీ మరియు జమాత్ అధ్యక్షులు ముర్షిదా వలి,గ్రామ మోల్వి సాహెబ్ ఆరిఫ్ పాషా, షేక్ బాబర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.