
telugu galam news e69news local news daily news today news
హైదరాబాద్ : పురాతనమైన నిజాం హయాంలో కట్టిన లాలాపేట్ కమాన్ ను గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతె శ్రీలత శోభన్ రెడ్డి గారు TSSPDCL, GHMC అధికారులతో కలిసి సందర్శించారు,
ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ గారు మట్లాడుతూ శిధిలావస్థలో ఉన్న లాలాపేట్ కమాన్ కు మరమ్మతులు చేయలని జిహెచ్ఎంసి సంబందిత అధికారులకు అదేశాలు జారి చేశారు, కమాన్ ను అనుకొని ఉన్న వృక్షాలు కొమ్మలు మరియు వేర్ల వల్ల లాలాపేట్ కమాన్ కూలిపోయే స్థితికి చేరుకుందని తక్షణమే చెట్ల కొమ్మలను తొలగించి మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందని, ఈ కమాన్ పై భాగం నుంచి 11KV విద్యుత్ లైన్లు వెళ్తున్నందున TSSPDCL అధికారులు కూడా సహకరించాలని అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు, పురాతన కట్టడాలను కాపుడుకోవడం మన అందరి బాధ్యత గా భావించాలి అని డిప్యూటీ మేయర్ గారు కొరారు.
ఈ కార్యక్రమంలో TSSPDCL డివిజనల్ ఇంజనీర్ శ్రీధర్ గారు, అసిస్టెంట్ ఇంజనీర్ రాజేష్, GHMC ఆర్టికల్చర్ విభాగ తార్నాక ఇంచార్జ్ సింధుజ, అసిస్టెంట్ ఇంజనీర్ వెంకటేష్, ఎంటమాలజీ విభాగం రాజశేఖర్ మరియు బీ ఆర్ ఎస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.