
telugu galam news e69news local news daily news today news
సీపీఎం విజ్ఞప్తి
గత అనేక ఏండ్లుగా వివాదస్పదం గా వున్న అయోధ్య లో రామ మందిర నిర్మాణ సమస్య సుప్రీం కోర్టు తీర్పు తో ముగిసిందని, రాజ్యాంగ స్ఫూర్తితో, సుప్రీం కోర్టు తీర్పు ను అన్ని వర్గాల ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, అన్ని రాజకయపార్టీలు, అన్ని సంస్థలు ఆమోదించాయని,
సి పీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు అన్నారు. నిన్న అయోధ్య లో బాలరాముని విగ్రహ ప్రతిష్ట రంగ రంగ వైభవంగా జరిగిందని,రామ భక్తులంతా భక్తి పరవసం తో ఆనoదోత్సవాలతో పండుగ వాతావరణం లో వేడుకలు జరుపుకోవడం శుభ పరిణామం అన్నారు.ఎటువంటి ఘటనలు, నిరసనలు జరగక పోవటం, ఆనంద దాయకం అన్నారు . సర్వమత సమానత్వానికి నిదర్శనం అన్నారు. రాజకీయ విమర్శ, ప్రతి విమర్శలు సాగుతున్నా మొత్తం గా చూస్తే అయోధ్య లో బాల రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం బాగా జరగడం సంతోషకరమి అన్నారు. ఇంకా మచ్చా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ
దక్షిణ అయోధ్య గా పేరుగాంచిన భద్రాద్రిని , భద్రాచలం లో కొలువు తీరిన సీతా రాములను మాత్రం పాలకులు అన్యాయం చేస్తున్నారని,నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారని, సీతా లక్ష్మణులతో శ్రీరాముడు వనవాసం లో నడయాడిన పరమ పుణ్య క్షేత్రం అయిన భద్రాచలం ప్రాంతంలో దేవాలాయాలను, చారిత్రిక ప్రదేశాలను పాలకులు పట్టిoచుకోవటం లేదు అనటంలో అతిశయోక్తి లేదని అన్నారు. ఇది నిర్వివాదాoశం. వనవాసంలో భాగంగా శ్రీరాముడు, సీతమ్మ నివాసం ఉన్న పర్ణశాలను పట్టించుకునే నాథుడే లేడు. రావణుడు సీతమ్మ ను పర్ణశాల నుండి అపహరించుకు పోయే మార్గంలో ఎదురు పడ్డ గర్ట్మంతుని రెక్క తెగిపడ్డ నేల రేఖపల్లి అక్కడ శ్రీ రామగిరి లో రామాలయం ఉన్నది. గత భద్రాచలం నియోజిక వర్గం (నేటి ఆంధ్రప్రదేశ్) భద్రాచలంలో శ్రీ రాముని ఆలయం నిర్మించిన శ్రీ భక్త రామదాసు కొలువున్న నేలకొండపల్లి (ఖమ్మం జిల్లా) ఈ ప్రాంతాల అభివృద్ది పట్ల పాలకులకు చిత్తశుద్ది లేదని పైగా నిర్లక్ష్యం, వివక్ష చూపుతున్నారన్నారు.
ఇక భద్రాచలం లో రాముని సమస్యలతో పాటు ప్రజల సమస్యల గురించి కూడా ప్రభుత్వాలు ఆలోచించే దిశగా ప్రజలు వత్తిడి చేయవలసిన సమయం ఆసన్నమైందని. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం భద్రాద్రి రామాలయ అభివృద్ధికి 100 కోట్లు ఇస్తామని పట్టించు కోని విషయం తెలిసిందేనని, ఇపుడు ఆలయ అభివృద్ది తో పాటు గోదావరి కరకట్ట, పోలవరం ముంపు బాధితుల సమస్య, ఆంధ్రా లో ఉన్న 5 గ్రామ పంచాయితీల ను భద్రాచలం లో కలపాలని, పాండురంగాపురం నుండి భద్రాచలం వరకు రైల్వే లైన్ పొదిగింపు, పురుషోత్త పట్న o దేవాలయ భూముల సమస్య, డంపింగ్ యార్డు తదితర సమస్యలపై పార్టీలు, ప్రజా సంఘాలు, స్వచ్చంద సంస్థలు, సమిష్టిగా, ఐక్యంగా అన్ని వర్గాల ప్రజలను సమీకరించి ఉద్యమించాలని అన్నారు. అందుకు అనుగుణంగా ఒక ప్రణాళిక ప్రకారం పని చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అయోధ్యకు ఇచ్చిన ప్రాధాన్యత భద్రాచలం కు ఇచ్చే పరిస్థితి లేదని,గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం భద్రాచలం అభివృద్ధి పట్ల తీవ్ర నిర్లక్ష్యం చేసిందని, ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అయినా భద్రాచలం కు తగు ప్రాధాన్యత ఇచ్చి భద్రాచలం అభివృద్ధి పట్ల చర్యలు చేపట్టాలని సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తుందన్నారు. అందుకోసం జరిగే కార్యాచరణకు సిపియం పార్టీ ప్రత్యక్ష, పరోక్షoగా మద్దత్తు తెలుపుతుంది.