
telugu galam news e69news local news daily news today news
కేంద్ర బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ కార్పొరేట్ మతోన్మాద అనుకూల విధానాలకు నిరసనగా కేంద్ర కార్మిక సంఘాల పిలుపుమేరకు ఫిబ్రవరి 16వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్వహిస్తున్నామని ఈ సమ్మెను చర్ల మండలంలో అన్ని రంగాల కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు కే బ్రహ్మచారి సిఐటియు జిల్లా కోశాధికారి జి పద్మ పిలుపునిచ్చారు సిఐటియు మండల కన్వీనర్ పాయం రాధాకుమారి అధ్యక్షతన సిఐటియు మండల జనరల్ బాడీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్మికుల హక్కులపై తీవ్రమైన దాడి చేస్తుందని విమర్శించారు ప్రజా సమస్యలను కార్మిక సమస్యలను దారి మళ్ళించడం కోసమే మతపరమైన అంశాలను రెచ్చగొడుతూ మతాన్ని బిజెపి రాజకీయంగా వాడుకుంటుందని పేర్కొన్నారు దేశవ్యాప్తంగా పనిచేస్తున్న స్కీం వర్కర్లందర్నీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్పోరేట్ కంపెనీల లాభాల కోసం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు రైతుల పండించే పంటకు గిట్టుబాటు ధరల చట్టం చేయాలని కోరారు కేంద్ర బిజెపి ప్రభుత్వం సంపన్నుల ప్రయోజనాల కోసం ప్రజల సంక్షేమాన్ని విస్మరిస్తుందని సిఐటియు పేర్కొన్నది ఫిబ్రవరి 16 సమ్మెలో సంయుక్త కిసాన్ మోర్చా రైతు వ్యవసాయ కార్మిక సంఘాల సైతం పాల్గొంటున్నాయని సమ్మెతో పాటు గ్రామీణ బందును జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు ట్రాన్స్పోర్ట్ మరియు హమాలీ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని సిఐటియు డిమాండ్ చేసింది హిట్ అండ్ రన్ పేరుతో తీసుకువచ్చిన ప్రమాదకరమైన నిబంధనలను రద్దు చేయాలని సిఐటియు డిమాండ్ చేసింది రాష్ట్రంలో ఏర్పడిన నూతన ప్రభుత్వం ఎన్నికల ముందు కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు సమ్మె జయప్రదం కోసం గ్రామస్థాయిలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించాలని నిర్ణయించారు జనరల్ బాడీ సమావేశంలో సిఐటియు అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యురాలు ఎం విజయశీల వివిధ రంగాల నాయకులు సమ్మక్క పృథ్వి విజయ్ అనురాధ నాగేంద్రమ్మ స్వరూప పాలెం నాగమణి విజయలక్ష్మి సావిత్రి చిలకమ్మ విజయ్ పుష్ప నాగమణి నిరోషా ముకుందం తదితరులు నాయకులు పాల్గొన్నారు.