
telugu galam news e69news local news daily news today news
మణుగూరు: ప్రభుత్వ డిగ్రీ కళాశాల మణుగూరు 2024 దోస్త్ అడ్మిషన్ల కొరకు నిర్వహించే అడ్మిషన్ల బ్రోచర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ శ్రీమతి ప్రియాంక ఆల సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డిగ్రీ కళాశాల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించాలని అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి శ్రీనివాస్ కు తెలియజేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నాణ్యమైన విద్యా బోధన అందించే అంశాన్ని విద్యార్థులకు తెలియజేసే విధంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని దానికి అనుగుణంగా కళాశాల సిబ్బంది కృషి చేయాలని అన్నారు . కళాశాలకు అవసరమైన సౌకర్యాల విషయంలో తనను ఎల్లప్పుడూ సంప్రదించవచ్చని జిల్లా కలెక్టర్ తెలియజేశారు. మారుమూల ప్రాంత ప్రజల సేవ కోసం దృఢ సంకల్పంతో పనిచేయాలని దానికి అనుగుణమైన ప్రణాళికలు కళాశాల ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అందించే కోర్సుల వివరాలను, అడ్మిషన్ల విధానాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి శ్రీనివాస్ నుండి అడిగి తెలుసుకుని అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి శ్రీనివాస్, దోస్త్ కోఆర్డినేటర్ డాక్టర్ సల్లా రమేష్ బాబు, అధ్యాపకులు డాక్టర్ మహమ్మద్ కరీం, డాక్టర్ పి .భాస్కరరావు, కళాశాల సిబ్బంది ఎండి దిలావర్ హుస్సేన్, ఎన్.రమేష్ పాల్గొన్నారు.