
telugu galam news e69news local news daily news today news
జాతీయ జెండాను ఎగరవేసిన స్టేషన్ ఘనపూర్ మండల అధ్యక్షుడు-శిరీష్ రెడ్డి
గళం న్యూస్ స్టేషన్ ఘనపూర్
జనగామ జిల్లా స్టేషన్ ఘనాపూర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు స్టేషన్ ఘనపూర్ మండల అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా శిరీష్ రెడ్డి మాట్లాడుతూ.. రాజ్యాంగ అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా ఈరోజు ప్రజలందరూ స్వేచ్ఛగా తమ హక్కులను అనుభవిస్తున్నారంటే దానికి కారణం రాజ్యాంగం కులమత వర్గా లింగ బేధాలు లేకుండా ప్రజలందరికీ ఓటు హక్కు కల్పించిన అంబేద్కర్ అని అన్నారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నగరబోయిన శ్రీరాములు,ఎంపిటిసి సింగపురం దయాకర్,మండల మహిళా ప్రధాన కార్యదర్శి నారగోని పద్మ,చింత జ్యోత్స్న,చింత ఎల్లయ్య, పట్టణ ఇంచార్జ్ నీల శ్రీధర్,ఐలపాక భూషణమ్ తదితరులు పాల్గొన్నారు