
telugu galam news e69news local news daily news today news
జనగామ జిల్లా జఫర్గడ్ మండలం తమ్మడపల్లి(జి) గ్రామంలో గణతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు.కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు మాచర్ల మహేందర్ ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా మాచర్ల మహేందర్ మాట్లాడుతూ.. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కుల ద్వారా మాత్రమే మనము స్వేచ్ఛ స్వాతంత్రాలతో తిరగ గలుగుతున్నామని ఓటు హక్కును కుల మత వర్గ లింగభేదం లేకుండా సమానంగా వినియోగించుకుంటున్నాము పాఠ్యపుస్తకాలే కాకుండా పిల్లలకి రాజ్యాంగం పైన అవగాహన కలిగే విధంగా రాజ్యాంగంలోని కొన్ని ముఖ్యమైన అంశాలను ఒక ప్రత్యేక పాఠ్యపుస్తకంగా ఏర్పాటు చేసి పిల్లలకు బోధిస్తే బాగుంటుంది అని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ మండల నాయకులు సిహెచ్.కృష్ణమూర్తి,దాసరి నాగరాజు,కూరపాటి విజయ్ కుమార్,కూరపాటి రాజేంద్రమ్,మాచర్ల అనిల్,పంది బోయిన సాంబరాజు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.