
telugu galam news e69news local news daily news today news
నేలపై కూర్చుని పిల్లల కళా ప్రదర్శనలు తిలకించిన ఐఏఎస్
భద్రాచలం : ఆయన ఓ ఐఏఎస్ అధికారి. అయినా తనకు సాదాసీదాగా ఉండటమే ఇష్టం. ఎంతలా అంటే.. నేలపైన కూర్చొని నేను సైతం సాధారణ మానవున్నే అనేలా… ఈ అరుదైన సంఘటన భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలో చోటుచేసుకుంది.ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలో శుక్రవారం రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా జరిపారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి శ్రీ ప్రతిక్ జైన్ గారు సతీ సమేతంగా ఈ వేడుకకు హాజరయ్యారు. జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం పిఓ ఐటిడిఏ అభివృద్ధికి సంబంధించిన నివేదికను సమర్పించారు. అనంతరం పిల్లలు ప్రదర్శించే సాంస్కృతిక కార్యక్రమాలకు సిద్ధమయ్యారు. వేదిక పైన సాంస్కృతిక ప్రదర్శనలు సాగుతుండగా, వేదికకు ముందు అతిధులు కుర్చీలో కూర్చునేలా ఏర్పాట్లు జరిగాయి. కానీ ఇందుకు భిన్నంగా ఐటీడీఏ పీవో శ్రీ ప్రతీక్ జైన్ గారు కుర్చీలన్నీ తీసివేపించి నేలపైనే కూర్చున్నారు. తనతో పాటు తన సతీమణి, భద్రాచలం ఐటిడిఏ ఏపీవో జనరల్ శ్రీ డేవిడ్ రాజ్ గారు, ఇతర ఐటీడీఏ యూనిట్ అధికారులు నేలపైనే కూర్చొని ఆధ్యాంతం సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. పిల్లలు డాన్స్ లు చేస్తూ ఉంటే… చప్పట్లు కొడుతూ వారిని ఉత్సాహపరిచారు. ఒక ఐఏఎస్ స్థాయి అధికారి నేలపై కూర్చొని సాంస్కృతిక ప్రదర్శనలు చూసిన సంఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. హంగు, ఆర్భాటాలతో హడావుడి చేసే ఈ రోజుల్లో…సాధారణ వ్యక్తిగా ఐటీడీఏ పీవో ఐఏఎస్ స్థాయి అధికారి ఇలా రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనడం పలువురుని ఆశ్చర్యపరిచింది. భళా..యువ ఐఏఎస్ అధికారి ప్రతీక్ సార్ అంటూ… పలువురు ప్రశంసించారు ఈరోజు ఐటీడీఏ ప్రాంగణంలో జరిగిన 75వ భారత గణతంత్ర దినోత్సవం కార్యక్రమంలో ప్రాజెక్ట్ అధికారి ప్రతీక్ జైన్ గారి సతీమణి రీచా జైన్ పాల్గొన్నారు. మరియు ఐటీడీఏ అధికారులు ఐటీడీఏ డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ ఏపీవో జనరల్ డేవిడ్ రాజ్ మొబైల్ కోర్ట్ జడ్జి శివాజీ ఈ ఈ ట్రైబల్ వెల్ఫేర్ అధికారి తానాజీ జిసిసి మేనేజర్ విజయ్ కుమార్ గురుకులం అధికారి టి వెంకటేశ్వర రాజు ఏవో భీమ్ ఏడి అగ్రికల్చర్ ఉదయ భాస్కర్ ఎస్ సురేష్ బాబు పీహెచ్ఓ అశోక్ జేడియం హరికృష్ణ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎన్ సి సి బి నాగులు చలపతి సారా చంద్ తదితరులు పాల్గొన్నారు.