
telugu galam news e69news local news daily news today news
జిల్లా పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిన డిఐజి ఈ రోజు సారపాక ఐటిసి గెస్ట్ హౌస్ నందు జిల్లా పోలీస్ అధికారులతో డిఐజి (ఎస్ఐబి) సుమతి ఐపిఎస్ గారు సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ రోజు ఉదయం నేరుగా హైదరాబాదు నుండి ఐటీసీ గెస్ట్ హౌస్ నకు చేరుకున్న డిఐజి గారిని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ స్వాగతం పలికారు.అనంతరం సమీక్షా సమావేశంలో పాల్గొన్న డిఐజి గారు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ గారిని జిల్లాలోని ప్రస్తుత స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.రాబోయే పార్లమెంటు ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సమావేశంలో పాల్గొన్న అధికారులకు సూచించారు.మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసే పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు నిషేధిత మావోయిస్టుల కదలికలపై సమాచారాన్ని సేకరిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి నిరంతర తనిఖీలు చేపట్టాలని తెలిపారు.CRPF బలగాలతో సమన్వయం పాటిస్తూ రాబోయే పార్లమెంట్ ఎన్నికలను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఎస్ఐబి ఎస్పీ బి.రాజేష్,81బిన్ CRPF కమాండెంట్ మనీష్ కుమార్ మీనా,141 CRPF కమాండెంట్ రితేష్ థాకూర్,కొత్తగూడెం ఓఎస్డి టి.సాయి మనోహర్,భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్,151bn అడిషనల్ కమాండెంట్ అయోధ్య సింగ్ మరియు డిఎస్పీలు వెంకటేష్,రాఘవేందర్రావు,రమణ మూర్తి మరియు సిఐలు,ఎస్సైలు పాల్గొన్నారు.