
telugu galam news e69news local news daily news today news
మేడారం జాతర పనులను మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శబరిష్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. జరుగుతున్న పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. మొదటగా విఐపి పార్కింగ్ స్థలాన్ని, ఆర్టీసీ బస్ స్టాండ్, హరిత హోటల్, జంపన్న వాగు స్తాన ఘటలు, స్థూపం రోడ్, కొత్తూరు సమీపంలోని మరుగు దొడ్ల పనులను పరిశీలించారు. అనంతరం కన్నేపల్లి గ్రామంలోని సారలమ్మ దేవాలయ పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్బంగా స్థానిక పూజారి కాక రంజిత్ దేవాలయ సమీపం మరుగు దొడ్లు, త్రాగు, నీరు , లైటింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. వెంటనే సంబంధిత అధికారులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ ఈ నెల చివరి లోపు జాతర పనులు పూర్తి అవుతాయని తెలియజేసారు. దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఎలాంటి డబ్బులు చెల్లించకుండా దైవ దర్శనం జరిగే ప్రసిద్ధ ఆలయ ప్రాంతం మన మేడారం కాబట్టి అధికారులు పనులు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ సకలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ అంకిత్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.శ్రీజ, దేవాదాయ శాఖ అధికారి రాజేందర్, పంచాయతీ అధికారి వెంకయ్య, ఈఈ అజయ్ కుమార్, డి ఎస్పి రవీందర్ ఇతర అధికారులు పాల్గొన్నారు