
telugu galam news e69news local news daily news today news
ఇక్కడ చదువుకున్న ఎంతో మంది విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు సీతక్క. ఆదివారం రోజున రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వార్షికోత్సవాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ అధినేత నారా భువనేశ్వరి జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర పంచాయతీ శాఖ, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లలందరికీ విద్యనందించడం మనందరి సామాజిక బాధ్యత అని, సమాజంలోని ప్రతి ఒక్కరూ చదువుకుంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని అందుకు విద్యార్థులు చదువుకు ప్రాధాన్యత నివ్వాలని విద్యార్థులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల సీఈఓ ప్రిన్సిపాల్, ఉపధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.