
-ప్రగతి భవన్ లో కేటీఆర్ పెంచుకునే కుక్కలకు 12లక్షలతో ఇండ్లు కట్టిండు -రాష్ట్రంలో ఉన్న పేదలకు మాత్రం ఒక్క ఇల్లు ఇవ్వాళే -గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తా గుర్తూర్ గ్రామ పంచాయితీ నూతన భవన్ ను ప్రారంభించిన పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క ఆదివారం రోజున ములుగు మండలంలోని గుర్తూరు తండా గ్రామములో నూతన గ్రామ పంచాయితీ కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క. ఈ సందర్భంగా మాట్లాడుతూ మారుమూల గ్రామాల అభివృద్ధికి నోచుకోని గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తానని గుర్తూర్ తండాలో గ్రామ ప్రజలు నా దృష్టికి తీసుకు వచ్చిన భూములకు పట్టాలు పంటలకు సాగునీరు అదే విధంగా గ్రామాల్లో సీసీ రోడ్లు సమస్యలకు త్వరలో పరిష్కరిస్తానని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటిలను పక్క అమలు చేస్తాం నిరుపేదలను గుర్తించి ఇల్లు 5లక్షలతో కట్టిస్తామని ఇప్పటికే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం 10లక్షల ఆరోగ్య శ్రీ పథకం అమలు చేశామని ఇంకా 4 గ్యారంటిలు త్వరలోనే అమలు చేయబోతున్నామని మంత్రి సీతక్క అన్నారు. కెసిఆర్ 10 యేండ్ల పాలనలో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత బి.ఆర్.ఎస్ ప్రభుత్వానిది అని మాది ప్రజా ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పని చేసే ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు పోతామని మంత్రి సీతక్క అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థల) శ్రీజ ఐఎఎస్ గారు, డిపిఓ,ఐటిడిఎ ఈఈ, డిఈ, గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్, గ్రామ కార్యదర్శితో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.