
telugu galam news e69news local news daily news today news
మణుగూరు : బహుజన సమాజ్ పార్టీని పినపాక అసెంబ్లి నియోజకవర్గంలో బలోపేతం చేయుటకు బియస్పి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డా,, ఆర్ యస్ ప్రవీణ్ కుమార్ ఐ పి యస్ వి ఆర్ యస్ ఆదేశాల మేరకు నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం మణుగూరులోని డా,, బి ఆర్ అంబేద్కర్ సెంటర్ లో జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జిల్లా ఇంచార్జి నల్లగట్ల రఘు, విశిష్ట అతిధిగా జిల్లా అధ్యక్షులు నడిపింటి మధు హాజరయ్యారు.జిల్లా ఇంచార్జి నల్లగట్ల రఘు నూతన కమిటీ నాయకులను ప్రకటిస్తూ పినపాక అసెంబ్లి నియోజకవర్గం అధ్యక్షులు గా పీక మల్లికార్జున రావు ను, అసెంబ్లి జనరల్ సెక్రటరీ గా పాయం సింగరాజు ను నియోజకవర్గ ఇన్చార్జిల్ గా vajja శ్యామ్ బొమ్మెర రాంబాబు , వైస్ ప్రెసిడెంట్స్ గా పెరుమాళ్ళ మోహన్,ఆరు రఫీక్, సెక్రటరీగా w. C కుమార్ కల్తి మల్లయ్య ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా sk నవాబ్ ఇసంపల్లి లింగన్న మహిళా కన్వీనర్ గా బి యస్ పి కుమారి, బి వి యఫ్ కన్వినర్ గా యనగంటి సంపత్ కుమార్ లను ప్రకటించారు.
నూతనంగా నియమించబడ్డ నాయకులను ఉద్దేశించి జిల్లా అధ్యక్షులు తో పాటు జిల్లా నాయకులు మాట్లాడుతూ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడాలి అన్నారు. రానున్న ఎన్నికల్లో అన్నీ వార్డుల్లో, పంచాయతీల్లో మండలాల్లో నీలిజండా ఎగురావేయాలి అన్నారు.అందుకు నూతన నాయకులంతా రెట్టింపైన ఉత్సాహం తో ఖచ్చితంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమం లో జిల్లా ఇ సి మెంబెర్ అసెంబ్లి గౌరవ సలహాదారులు పాక వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి బూర్గుల కరుణాకర్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ భాగవతపు సతీష్ యాదవ్, బియస్పి భద్రాచలం అసెంబ్లి నాయకులు కొప్పుల రాంబాబు, నీరజ్,ప్రణయ్, రాజు తదితరులు పాల్గొన్నారు.