
telugu galam news e69news local news daily news today news
నూతన ప్రభుత్వం గత పాలకుల తప్పిదాలు చేయొద్దు
బుర్ర వీరభద్రం, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి
భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ), భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని సోమవారం కలెక్టరేట్ ముట్టడి నిర్వహించారు, వేలాది మంది గా విద్యార్థులు హాజరయ్యారు. కాకతీయ యూనివర్సిటీ అనుబంధ ఇంజనీరింగ్ కళాశాల నుండి నూతన కలెక్టరేట్ భవనం వరకు విద్యార్థి మహా ప్రదర్శన నిర్వహించారు. ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కార్యాలయం గేటు ఎదుట బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. లోనికి అనుమతించాలని నినాదాలు చేయడంతో పోలీసులకు విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. కలెక్టర్ కార్యాలయం ఎదుట విద్యార్థులను ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బుర్ర వీరభద్రం మాట్లాడుతూ జిల్లాలో నెలకొన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్లో ఉన్న 7800 కోట్ల స్కాలర్షిప్స్ మరియు ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని, మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచాలని, పెండింగ్లో ఉన్న మెస్, కాస్మోటిక్ చార్జీలు విడుదల చేయాలని, పెండింగ్లో ఉన్న డైట్ బిల్లులను విడుదల చేయాలని, రాష్ట్రంలో విద్యారంగంలో ఖాళీగా ఉన్న 26 వేల ఉపాధ్యాయ పోస్టులు, ఉపాధ్యాయేతర పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఉన్నత విద్యలో టెక్నికల్ ఎడ్యుకేషన్ విద్యార్థులకు గత మూడు సంవత్సరాలుగా ట్యూషన్ ఫీజు,మెస్ ఫీజులు రావట్లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని, ఇంటర్మీడియట్ ,10వ తరగతి విద్యార్థులకు స్పెషల్ మెనూ అందించాలని, జిల్లాలో నూతన ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ములకలపల్లి సుజాత నగర్ కొత్తగూడెం మండల కేంద్రాల్లో వసతి గృహాలు ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రియాంక అల కు మెమొరాండం అందజేశారు. సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు సండ్ర భూపేందర్, బయ్యా అభిమన్యు,కె సందీప్,బి అభిమిత్ర, జిల్లా సహాయ కార్యదర్శి మంద నాగకృష్ణ, జిల్లా నాయకులు యశ్వంత్,రామ్ చరణ్,ప్రవీణ్, పవన్,చరణ్, భవాని,సుధీర్ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి సాగర్, నాయకులు నిఖిల్,ప్రణయ్,వర్ధన్ తదితరులు పాల్గొన్నారు.