
telugu galam news e69news local news daily news today news
జాతీయ స్థాయి రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా, వాహనచోదకులకు ట్రాఫిక్ పై అవగాహన కార్యక్రమాన్ని స్థానిక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో సోమవారం భద్రాచలం ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రైవర్లు రోడ్డు మీద తమ వాహనాలను వ్యతిరేక దిశలో నడిపి ప్రమాదాలకు గురికావద్దని సూచించారు. వాహనాన్ని నడిపే డ్రైవర్లు కంటి చూపుపై అశ్రద్ధ చూపవద్దని దగ్గరచూపు, దూరపుచూపు లోపాలు ఉంటే కంటి వైద్యులను సంప్రదించి చూపించుకోవాలని కోరారు. డ్రైవర్లకు కంటిచూపు బాగా ఉంటేనే ప్రయాణికులను వారి గమ్యాలకు సురక్షితంగా చేర్చి, మీరు కూడా మీ కుటుంబాన్ని కలుసుకొని సంతోషంగా ఉంటారని తెలిపారు. డ్రైవర్లు సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపరాదని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని వారు డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే శిక్ష తప్పదని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాలు నివారించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు .రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం 20 నుంచి 30 సంవత్సరాల లోపు వారే అధిక శాతం మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను నడిపితే చట్టరీత్యా శిక్షలు తప్పవని హెచ్చరించారు. నిరంతరం జాతీయ రహదారిపై పోలీసుల నిఘా ఉంటుందని తెలిపారు. వాహనాలు నడిపేటప్పుడు నిర్లక్ష్యం,అతివేగం తగదని, వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ క్షేమంగా వారి గమ్యస్థానాలకు చేరాలన్నారు. బైక్ లపై వెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరూ హెల్మెట్ అదే విధంగా కారు నడిపే సమయంలో సీల్డ్ బెల్ట్ తప్పక ధరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏఎస్ఐ లు వెంకన్న , శ్రీనివాస్ , ట్రాఫిక్ సిబ్బంది, వాహనదారులు పాల్గొన్నారు.