
e69 news telugu news local news
శాశ్వత ప్రతిపాదికన మూడు టవర్స్ ప్రారంభం.
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో శాశ్వత ప్రతిపాదికన ఏర్పాటుచేసిన మూడు ఎయిర్టెల్ టవర్స్ ను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇండస్ టవర్స్ సీఈవో దిలీప్ కుమార్ తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మేడారం ప్రాంతంలో శాశ్వత ప్రతిపాదికన నిరంతరం ఎయిర్టెల్ సేవలు అందించడం కోసం మేడారం , ప్రాజెక్ట్ నగర్ , ఏలుబాక ప్రాంతాలలో మూడు టవర్స్ నిర్మించడం జరిగిందని నిరంతరం భక్తులకు ఎయిర్టెల్ తమ సేవలను అందించడానికి కృషి చేస్తుందని తెలిపారు. కంపెనీ సీఈవో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మేడారం ప్రాంతంలో శాశ్వత ప్రతిపాదికన మూడు ఎయిర్టెల్ టవర్స్ ప్రారంభించడం జరిగిందని వీటితో పాటు జాతర సమయంలో 12 తాత్కాలిక ఎయిర్టెల్ టవర్స్ ద్వారా భక్తులకు తమ సేవలను అందిస్తామని ఇప్పటికే ఐదు టవర్స్ ద్వారా సేవ అందించడం జరుగుతుందని అన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ హరిత హోటల్ మరమ్మతు పనులను , ఊరటం నుంచి కాల్వపల్లి బైపాస్ రహదారి, కొంగల మడుగు నుంచి చింతల్ క్రాస్ రహదారి పనులను పరిశీలించారు. పనులన్నీ త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, పంచాయతీరాజ్ ఈఈ అజయ్ కుమార్, స్థానిక ఎమ్మార్వో రవీందర్ , ఏరియా మేనేజర్ రమేష్ బాబు, సుగుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.