
e69 news telugu news local news
ఇప్పటి వరకూ జరిగిన ప్రసవాలపై విచారణ చేయాలని డిమాండ్ తల్లిని మోసం చేసి బిడ్డను విక్రయం, బతికి ఉన్న బిడ్డకు డెత్ సర్టిఫికెట్ నవమాసాలు మోసిన కన్నతల్లి కండ్లు గప్పారు. బతికి ఉన్న బిడ్డ చనిపోయాడని డెత్ సర్టిఫికెట్ ఇచ్చి, అంగట్లో అమ్ముకు న్నారు. ఇదంతా చేసింది ఎవరో కాదు. అందరు దేవునిగా భావించే వైద్యులే.. వివరాలలోకి వెళ్తే.. భద్రాచలంలో శిశువు విక్రయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆర్టీసీ బస్టాండు వెనుక బ్యాంకు స్ట్రీటులో ఉన్న ఓ ఆస్పత్రిలో ఇటీవల అప్పుడే పుట్టిన బిడ్డను కొత్తగూ డెంలోని మహిళకు విక్రయించారు. కొత్తగూడెంలో శిశువు పాలు తాగకుండా నలతగా ఉండటంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. పాలతాగక పోవడానికి కారణం ఆ మహిళకు చెందిన శిశువు కాకపోవడమే అని తెలుసుకుని ఆస్పత్రి వర్గాలు చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్లకు సమాచారం ఇచ్చారు. వారు విచారించి శిశువును స్వాధీనం చేసుకుని బాలల కేంద్రంకు తరలించారు. కాగా శిశువును అక్రమంగా విక్రయించ డమే కాకుండా, దత్తత తీసుకున్నట్లుగా కాగితాలు రాసుకున్నారు. ఈ విషయంలో భద్రాచలంకు చెందిన ఓ లాయర్ కీలక పాత్ర పోషించినట్లుగా తెలుస్తోంది. మరో వైపు భద్రాచలంలో శిశువు జన్మించిన ఆస్పత్రిలో చనిపోయినట్లుగా డెత్ సర్టిఫికేట్ కూడా సృష్టిం చినట్లు విచారణలో బహిర్గతం అయినట్లుగా సమాచారం. దీనిపై జిల్లా చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్లు విచారణ జరుపుతున్నారు. ఈ సంఘట నపై భద్రాచలం ఐఎంఏ వైద్యులు గురువారం రాత్రి అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం గమనార్హం. సుమారు రూ.2.50లక్ష లకు శిశువును విక్రయించడం, ఆస్పత్రి నుంచి డెత్ సర్టిఫికేట్ జారీ చేయడం వంటి అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ఈ విషయమై జిల్లాచైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ విజేతను వివరణ కోరగా… ఘటన వాస్తవమేనని, విచారణలో ఉందని, రెండు రోజుల్లో పూర్తి సమాచారం ఇస్తామని తెలిపారు. కాగా ఈ వైద్యశాలలో గతంలో నిర్వహించిన ప్రసవలపై విచారణ జరపాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.