
telugu galam news e69news local news daily news today news
జనగామ జిల్లా కేంద్రంలోని శ్రీ ఉషోదయ ఫంక్షన్ హాల్లో జరిగిన జనగామ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం, ఈ సమావేశానికి జనగామ ఎమ్మెల్యే శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అధ్యక్షత న ముఖ్య అతిధిగా పాల్గొన్న గౌరవ మాజీ మంత్రివర్యులు సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు గారు,మాజీ ఉపముఖ్యమంత్రి వర్యులు,స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి.ఈ సందర్బంగా స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ…బి.అర్. ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాకపోయినా కృంగి పోవాల్సిన అవసరం లేదు,గెలుపోటములు సహజమన్నారు.తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ చేసిన పనులు కళ్ళముందే కనపడుతున్నాయన్నారు.కాంగ్రెస్ పార్టీ పెట్టిన హామీలు వీలు కానీ హామీలు ఆరు గ్యారెంటీ పథకాలు అన్నారు.కానీ అవి 420 పథకాల హామీలన్నారు.రేవంత్ మాట మీద నిలబడేవాడైతే 100 రోజుల్లో పెట్టిన హామీలు అమలు చేసి ఓటు అడగాలన్నారు.ముఖ్యమంత్రి అయినాక తొలి సంతకం రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని, రైతుబరోసా కింద 15000 రూపాయల రైతు బంధు ఇస్తామన్న హామీ ఇంకా అమలు కాలేదన్నారు.రేవంత్ రెడ్డి ఆలోచన లేక, అర్థం కాక ఆగమాగమై మాట్లాడుతున్నారన్నారు.అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లో కాంగ్రెస్ పార్టి గ్రాఫ్ రోజు రోజు కి పడిపోతుందన్నారు.వచ్చే ఎలక్షన్ లో మళ్ళీ బి.ఆర్.ఎస్ అధికారం లోకి రావడం ఖాయమన్నారు.ముఖ్యమంత్రి పీసీసీ అధ్యక్షుడి గా ఉన్నప్పుడు ఎలా మాట్లాడుతున్నారో ఇప్పుడూ అలాగే మాట్లాడుతున్నారు.ఢిల్లీలో తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడాలంటే ఎంపీ ఎన్నికల్లో విజయం సాధించాలని,తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం పోరాడేది ఒక్క బి.ఆర్.ఎస్ పార్టీ మాత్రమేనని,ఎంపీ ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తా చాటాలి. పట్టుదలతో పనిచేయాలన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మాజీ ఎమ్మెల్సీ బోడకుంట్ల వెంకటేశ్వర్లు మరియు ప్రజాప్రతినిధులు,సుమారు 2000 మంది బి.ఆర్.ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.