
telugu galam news e69news local news daily news today news
ఎస్.వీరయ్య సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు
కార్మిక, కర్షక ఐక్యత తో కార్పోరేట్, మతతత్వ విధానాలను తిప్పికొడదాం
- పోతినేని సుదర్శన్ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు
సిపిఎం కేంద్ర కమిటీ నాయకులు సాయిబాబు
భారత దేశంలో అధికారం లో ఉన్న బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పోరేట్ ,మతతత్వ విదానాల నుంచి దేశాన్ని రక్షించుకోవడం కోసం ఫిబ్రవరి 16 న జరిగే దేశ వ్యాప్త సమ్మె, బంద్ కు సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని కేంద్ర కమిటీ నాయకులు సాయిబాబు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్.వీరయ్య, పోతినేని సుదర్శన్ లు తెలిపారు, మంగళవారం నాడు మంచికంటి భవన్ లో సిపిఎం జిల్లా ప్లీనరీ సమావేశం నిర్వహించారు, సమావేశాల ప్రారంభ సూచికగా సిపిఎం సీనియర్ నాయకులు కాసాని అయిలయ్య పార్టీ జెండా ఆవిష్కరించారు, అనంతరం ఎజె రమేష్, ఎం.జ్యోతి,కె.పుల్లయ్య లు అద్యక్షవర్గం గా సమావేశం జరిగింది, ఈ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ దేశాన్ని రక్షించాల్సిన పాలకులు దేశాన్ని లూటీ చేస్తున్నారని అన్నారు, దేశ సంపదను, కార్మిక, కర్షక హక్కుల ను కాపాడుకోవడం కోసం ఫిబ్రవరి 16 న జరిగే దేశ వ్యాప్త సమ్మె, బంద్ లో ప్రజాస్వామిక వాదులు,ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు, దేశ సంపదను కార్పొరేట్లకు దోచి పెడుతూ, రైతులు, సామాన్య ప్రజలను దోపిడీ చేస్తున్నదని విమర్శించారు, అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని,కనీస మద్దతు ధర చట్టం చేయాలని, కార్మిక చట్టాల మార్పులను రద్దు చేయాలని, ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచాలని,కనీస వేతనం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు, పేదలను ధనవంతు లను చేస్తానని మాయమాటలు చెప్పిన మోడీ వందల కోట్ల ఆస్తి పరులకు దేశాన్ని అమ్మకానికి పెట్టారని విమర్శించారు.
ఈకార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొలగాని బ్రహ్మచారి, ఎంబి నర్సారెడ్డి,కారం పుల్లయ్య,లిక్కి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు రేపాకుల శ్రీనివాస్, అన్నవరపు సత్యనారాయణ, కొండపల్లి శ్రీదర్, దొడ్డ రవికుమార్, భూక్యా రమేష్, వీర్ల రమేష్, నిమ్మల వెంకన్న, ముదిగొండ రాంబాబు, యలమంచిలి వంశీ,గద్దల శ్రీను,కొండబోయిన వెంకటేశ్వర్లు,ఎస్ ఏ నబి,కున్సోత్ ధర్మ,, దొడ్డ లక్ష్మీనారాయణ, పిట్టల అర్జున్,గంగ,పద్మ,డి.వీరన్న,ఎస్ లక్ష్మి,బి.వీరభద్రం , హరిక్రిష్ణ, తదితరులు పాల్గొన్నారు