
telugu galam news e69news local news daily news today news
గిరిజన విద్యార్థినీ ,విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మక శక్తి, నైపుణ్యాలను పెంపొందించడం ఉపాధ్యాయ లదే – ఐ టి డి ఎ, పీ ఓ – ప్రతీక్ జైన్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు కనీస సామర్ధ్యాలపై అవగాహన కల్పించడం కోసం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల భద్రాచలంలో చదువుకుంటున్న విద్యార్థిని, విద్యార్థులు ఎన్ఎస్ఎస్ యూనిట్ 1 మరియు2 వాలంటీర్లను పిల్లల కోసం కార్యక్రమంలో పాలుపంచు కోవడం చాలా సంతోషమని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ప్రతిక్ జైన్ అన్నారు. భద్రాచలంలోని డిగ్రీ కళాశాల ఆవరణలో ఎన్ఎస్ఎస్ యూనిట్ 1 మరియు 2 ఆధ్వర్యంలో పిల్లల కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పీవో హాజరై పిల్లలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ గిరిజన విద్యార్థినీ ,విద్యార్థులలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీయడానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని ఆయన అన్నారు. అనంతరం డిగ్రీ కళాశాల ప్రధాన చార్యులు మాట్లాడుతూ గిరిజన విద్యార్థిని, విద్యార్థులకు యూనివర్సిటీ ఫీజు ఆర్థిక భారంగా మారుతుందని పిఓ దృష్టికి తీసుకురాగా, ఈ ఆర్థిక భారాన్ని గిరిజన విద్యార్థుల కొరకు తప్పకుండా ఐటీడీఏ భరిస్తుందని ఆయన వారికి హామీ ఇచ్చారు. అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల భద్రాచలంలో చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులు ఎన్ఎస్ఎస్ యూనిట్ వాలంటీర్లను పిల్లల కోసం కార్యక్రమంలో పాలుపంచుకున్న వారితో వారి అనుభవాలను లలిత కుమారి మరియు ఇమ్రాన్ విద్యార్థుల ద్వారా తెలుసుకొని వారిని సరైన నైపుణ్యాలపై ఉద్దేశించి విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రధానాచార్యులు జాన్ మిల్టన్, పిల్లల కోసం స్టేట్ బృందం అభిజిత్, రో మిల్ల ,అస్త్ర ,ఎన్ఎస్ఎస్ యూనిట్ 1 మరియు 2 పిఓలు ,ఎస్. శ్యాంప్రసాద్, డాక్టర్ వీరన్న, కళాశాల అధ్యాపక ,అధ్యాపకేతర మరియు విద్యార్థిని ,విద్యార్థులు పాల్గొన్నారు.