
జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి పని కల్పించాలి
పని ప్రదేశంలో కనీస సౌకర్యాలు ఉండేలా చూడాలి-తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి వడ్లకొండ సుధాకర్ తెలుగు గళం జఫర్ఘడ్ మార్చి06 జాబ్ కార్డు ఉన్న ప్రతి ఉపాధి కూలికి పని కల్పించి పని ప్రదేశంలో కనీస సౌకర్యాలు ఉండేలా చూడాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి వడ్లకొండ సుధాకర్ డిమాండ్ చేశారు.మంగళవారం తమ్మనపల్లి(జి)గ్రామంలో సాయంత్రం ఉపాధి కూలీల సమావేశం సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కలెక్టర్ ఉపాధి కూలీల సంఖ్యను పెంచే విధంగా అధికారులను కోరినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు.ప్రభుత్వం ఉపాధి హామీ కూలీలకు గతంలో లాగా పనిముట్లను అందజేసి,పని ప్రదేశంలో మెడికల్ కిట్ ఉండేలా చూడాలన్నారు.ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని పటిష్ట పరుస్తూ పట్టణాలకు చేయాలన్నారు.రోజు వారి వేతనము ఎలాంటి కొలతలు లేకుండా 800 రూపాయలు ఇవ్వాలని,వందరోజుల పని దినాలను 200 రోజులకు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.పనిచేసిన కూలీలకు 15 రోజుల్లోగా డబ్బులు అందేలాగా చూడాలన్నారు.లేనిపక్షంలో కూలీలను సమీకరించి ఆందోళన చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సంఘం గ్రామ అధ్యక్ష కార్యదర్శులు కనుబైన నాగయ్య చిలువేరి మల్లేష్ కూలీలు వేల్పుల చిన్న రాములు ఎండి షబానా చొప్పరి వెంకటమ్మ ఉప్పునూతల ఎల్లమ్మ వేల్పుల రాములు నక్క యాకయ్య తదితరులు పాల్గొన్నారు.