
కత్తి నాగబాబు బిఎస్ఎఫ్ఐ నియోజకవర్గ అధ్యక్షులు.
కత్తి నాగబాబు బిఎస్ఎఫ్ఐ నియోజకవర్గ అధ్యక్షులు.
గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులను పెంచకుండా పరీక్ష తేదీలను మాత్రమే ప్రకటించడం సరికాదని కత్తి నాగబాబు అన్నారు శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పోస్టులను పెంపు కోసం లక్షలాదిమంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారని అని అన్నారు రెండు సంవత్సరాలుగా నోటిఫికేషన్ లేవని కొత్త ప్రభుత్వంలో కూడా గత కెసిఆర్ సర్కార్ ఇచ్చిన నోటిఫికేషన్ 2022లో ప్రకటించిన పోస్టులు వేయటం ఎంతవరకు సమంజసం అని కత్తి నాగబాబు ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రూప్ 2 3 పోస్టులు పెంచుతామని సీఎం రేవంత్ రెడ్డి గతంలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాలు బర్తించేస్తానని చెప్పడంతో లక్షలాదిమంది నిరుద్యోగులు లైబ్రరీ, స్టడీ రూమ్‌లకు పరిమితమయ్యారని పేర్కొన్నారు. తీరా పాత నోటిఫికేషన్ ప్రకారం పరీక్షలు తేదీలలో ప్రకటించడం బాధాకరమని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి గ్రూప్ 2 పోస్ట్‌లు 2000 గ్రూప్ 3 పోస్ట్‌లు 3000 పెంచాలని కోరారు.