
ప్రత్యేక బాధ్యతలు తీసుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రతిక్ జైన్
ఐటీడీఏ నివాస గృహాల సముదాయాలలో అసంపూర్తిగా ఉన్న గృహాల పనులు వేగవంతం చేసి త్వరితగతిన రిపేర్లు చేయించాలి
గృహ నిర్మాణం పనులు పూర్తిచేసి సిబ్బందికి ఉపయోగించుకునే విధంగా సంబంధిత అధికారులు ప్రత్యేక బాధ్యతలు తీసుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రతిక్ జైన్
ఐటీడీఏ ప్రాంగణంలోని అసంపూర్తిగా ఉండి నివాస గృహాలలో జరుగుతున్న పనులను పరిశీలించి గృహాలు పనులు ఎంతవరకు పూర్తయినవని సంబంధిత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సంబంధిత అధికారులకు సూచనలు ఇస్తూ ఎంతో వ్యయంతో నివాస గృహాలు ప్రారంభించి అసంపూర్తిగా వదిలివేయడంతో అవి దేనికి పనికి రాకుండా పోతున్నాయని వాటిని రిపేరు చేయించి సిబ్బందికి కేటాయించాలని పనులు ప్రారంభించినందున వాటిని సాధ్యమైనంత తొందరగా పూర్తిస్థాయిలో ఇండ్లను తయారు చేయాలని, అలాగే ఐటీడీఏ కార్యాలయం పైన ఉన్న అసంపూర్తిగా ఉన్న భవనాల పనులు ప్రారంభించి నందున తొందరగా పూర్తి అయ్యేవిధంగా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని భవనాలు ఉపయోగంలోకి తీసుకొని రావాలని ఆయన అన్నారు. అలాగే చిన్న పిల్లలకు ఆటవీడుపుగా గతంలో ఏర్పాటు చేసిన ఆట స్థలాలను మెరుగుపరిచి, పిల్లలకు సౌకర్యంగా ఉండేలా చూడాలని ఐటీడీఏ పరిసరాలను ప్రతిరోజు శుభ్రం చేయించి, కార్యాలయానికి వచ్చే ప్రజలకు సిబ్బందికి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏపీవో జనరల్ డేవిడ్ రాజ్, డి టి ఆర్ ఓ ఎఫ్ ఆర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.