
-సిపిఐఎంఎల్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్
ఎలాంటి పర్మిషన్ లేకుండా వేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి-సిపిఐఎంఎల్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్
గళం న్యూస్ టేకుమట్ల. బోర్లు ఎక్కువగా వేయడం వలన భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి రైతుల బావులు ఎండిపోతున్నాయి గ్రామాల్లో మంచినీళ్ల బావులు కూడా ఎండిపోతున్నాయి రైతులకు అటు ప్రజలకు నీళ్లు దొరకక ఇబ్బంది పడుతున్నారు అసలే వేసవికాలం ఎలాంటి పర్మిషన్ లేకుండా వాళ్ళ ఇష్టానుసారంగా బోరు బావులు ఇస్తున్నారు రెవిన్యూ అధికారులు కానీ ఇరిగేషన్ అధికారులు కానీ పట్టించుకున్న దాఖలు కనబడడం లేదు వీళ్ళ మాములు వీళ్లకు ముడితే సరిపోతుంది అని ఆలోచనలో వీళ్ళు ఉన్నారు వాల్టా చట్టాన్ని అమలు చేయకుండా ఆ చట్టానికి తూట్లు పొడుస్తున్నారు వాల్టా చట్టాన్ని పకడిబందీగా అమలు చేయాలని పర్మిషన్ లేకుండా బోర్లు వేస్తున్న వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్లక్ష్యం చేస్తున్న అధికారుల పైన చర్యలు తీసుకొని ప్రజలకు వేసవికాలంలో మంచినీళ్లు ప్రతిరోజు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని బోరు బావులను నియంత్రించి రైతు బావులను కాపాడాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అన్నారు.