
ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసావాలను పెంచేందుకు కృషి చేయాలి
మహబూబాబాద్ జిల్లా గళం న్యూస్:-
ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాలను పెంచేఅందుకు కృషి చేయాలని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ మహబూబాబాద్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ పేర్కొన్నారు.
శుక్రవారం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, మహబూబాబాద్ నందు జిల్లా ఆసుపత్రి గైనకాలజిస్ట్లు, తెలంగాణా వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల సూపర్డెంట్లు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ప్రోగ్రాం అధికారులతో జరిగిన సమన్వయ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి మాట్లాడుతూ అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి మహబూబాబాద్ జిల్లా లో సాధారణ ప్రసవాలను పెంచి మహబూబాబాద్ జిల్లాను రాష్ట్రం లో ఉన్నత స్థానంలో వుంచాలని పేర్కొన్నారు.
జిల్లా ఆసుపత్రుల సమన్వయ కర్త డాక్టర్ వెంకట్ రాములు మాట్లాడుతూ క్షేత్ర స్థాయి లోని సిబ్బంది మహిళ గర్భం ధరించి నప్పటి నుండి ప్రసవం జరిగే వరకు సాధారణ ప్రసవాల కొరకు అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని ఆయన తెలిపారు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రీ విద్య మాట్లాడుతూ జనరల్ హాస్పిటల్ కు వచ్చిన గర్భిణీ స్త్రీలకు కౌన్సిలింగ్ ఇచ్చి నార్మల్ డెలివరీ కోసం ప్రయత్నం చేస్తున్నామని ఇకముందు కూడా తమ వంతు కృషిచేసి సాధారణ ప్రసవాలను పెంచేందుకు తోడ్పాటున అందిస్తామని తెలిపారు.
జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ బిందుశ్రీ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలను తీసుకువచ్చే ఆశా కార్యకర్తలకు ప్రభుత్వ ఆసుపత్రిలో సదుపాయాలు కల్పించాలని పేర్కొన్నారు.
ఈ సమన్వయ సమావేశంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కళావతి భాయి, ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ వెంకట్ రాములు, గూడూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరింటెండెంట్ డాక్టర్ వీరన్న, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరిండెంట్ డాక్టర్ చింతా రమేష్, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ బిందు శ్రీ, డాక్టర్ అంబరీష, డాక్టర్ సుధీర్ రెడ్డి, డాక్టర్ మురళీధర్, ప్రబుత్వ ఆసుపత్రికి గైనకాలజిస్టులు డాక్టర్ శ్రీవిద్య అసోసియేట్ ప్రొఫెసర్, డాక్టర్ దీప్తి, డాక్టర్ కరుణాకర్ అసోసియేట్ ప్రొఫెసర్ పీడియాట్రిక్స్, ప్రసాద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.