
ప్రశాంతంగా ముగిసిన పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ లలో మూడు సంవత్సరాల ఇంజనీరింగ్ కోర్సులతో పాటు, వ్యవసాయ డిప్లొమా, వెటరినరీ డిప్లొమా కోర్సు లలో ప్రవేశం కొరకు శుక్రవారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1-30 గంటల వరకు నిర్వహించిన పాలీసేట్ – 24 ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షకు మహబూబాబాద్ పట్టణంలో 6 పరీక్షా సెంటర్ లలో బాలురు 887, బాలికలు 722 మొత్తం 1609 మంది విద్యార్దులకు గాను బాలురు 784, బాలికలు 645 మొత్తం 1429 మంది విద్యార్దులు హాజరయ్యారు. ఈ పర్యవేక్షణలో సాంకేతిక విద్యాశాఖ జిల్లా కో ఆర్డినేటర్ డి. శోభారాణి , ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డి. రాజు, ప్రత్యేక పరిశీలకులుగా ఎం. చంద్ర ప్రకాష్ సాంకేతిక విద్యా శాఖ , ఏం. శ్రీ రాములు విద్యా శాఖ , యు. నర్సయ్య రెవిన్యూ శాఖ , యాకుబ్ రెడ్డి పోలీస్ శాఖ పాల్గొన్నారు.