
అందెశ్రీ ప్రతిభ మేడిపండు.. అహంకారం రాచపుండు• కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత పసునూరి హైదరాబాద్ సిటీబ్యూరో, : జయ జయహే తెలంగాణ గీతాన్ని దళితులకు పాడే అర్హత లేదని కవి, గాయకుడు అందె శ్రీ తనతో అన్నారని కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత డాక్టర్ పసునూరి రవీందర్ ఒక ప్రక టనలో పేర్కొన్నారు. దీన్నిబట్టి ఆయ న ప్రతిభ మేడిపండులా, అహంకా రం రాచపుండులా ఉన్నదని విమర్శం చారు. ఈ పాటను సంబండవర్గాల వారికి మాత్రమే పాడే హక్కు ఉన్న దని, దళితులకు లేదంటూ ఆయన కరాఖండిగా చెప్పారని, ఇది దళిత జాతిని అవమానించడమేనని పేర్కొ న్నారు. గత ఏప్రిల్లో జరిగిన సమూ హ సెక్యులర్ రైటర్స్ ఫోరం తరపున వాగ్గేయకారులను ఆహ్వానించే బాధ్య తను తనకు అప్పగించారని, ఆ సమ యంలో అందెశ్రీకి ఫోన్ చేసి కార్యక్ర మానికి రావాలని కోరానని, ఆ సమ యంలోనే ఆయన స్వయంగా తనతో ఈ గీతాన్ని పాడే హక్కు దళితులకు లేదని అన్నారని, చాలా పరుషంగా మాట్లాడారని తెలిపారు. పేరు వచ్చిం దని దళితుడిగా చెప్పుకోవడా నికి కూడా ఆయన ఇష్టపడటం లేదని పసునూరి రవీందర్ పేర్కొన్నారు.