ప్రభుత్వ పాఠశాలలోనే మెరుగైన విద్య
Jangaonప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సంతోష్ అన్నారు. మండలంలోని కొమల్ల ప్రాథమిక పాఠశాలలో గతంలో విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థి కన్నారపు ప్రవీణ్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు నోట్ బుక్స్ పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ ఎక్కడ ఉన్న విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాలను మరువద్దనే ఉద్దేశంతో ప్రవీణ్ విద్యార్థులకు నోట్ బుక్స్ పెన్నులు పంపిణీ చేయడం అభినందనీయమని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సౌకర్యార్థం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలోనే అర్హత కలిగిన ఉపాధ్యాయులు విద్యా బోధనలు చేస్తారని దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు అవగాహన పెంచుకొని తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఆయన కోరారు. అనంతరము ప్రవీణ్ కు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ మేకల మురళి, నాయకులు బొల్లపల్లి ఎర్ర కుమారస్వామి, మేకల నరేందర్, మంకెన అన్నపురెడ్డి, బంధ కుమారస్వామి, తాళ్లపల్లి యాదగిరి, తాటికొండ వెంకటేష్ యాదవ్, పొన్నం రాజు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.