ప్రాథమిక సహకార సంఘం కార్యాలయంలో రైతు భరోసా అభిప్రాయ సేకరణ
Muluguవెంకటాపురం(నూగురు ) ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం కార్యాలయంలో రైతు భరోసా పథకంపై అత్యవసర సర్వసభ్య సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సమావేశంలో మండలంలోని వివిధ గ్రామాల నుండి రైతులు రైతు భరోసా పథకం పై వారి వారి అభిప్రాయ సేకరణలో సలహాలు మరియు అభిప్రాయాలనువ్యక్తం చేశారు. ఈ అభిప్రాయ సేకరణను సొసైటీ సిబ్బంది మినిట్స్ లో నమోదు చేశారు. ముఖ్యంగా ఐదు నుండి పది ఎకరాల లోపు రైతులకు మాత్రమే రైతు భరోసా రైతుబంధు కల్పించాలని మెజారిటీ రైతులు తెలియజేశారు. ఎక్కువ విస్తీర్ణం ఉన్న రైతులను వెంటనే ఈ పథకం నుండి తొలగించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే రైతుబంధు నగదును రెట్టింపు చేయాలని మెజారిటీ రైతులు సమావేశంలో అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే కౌలు రైతులకు కూడా రైతుబంధు రైతు భరోసా కల్పించాలని అలాగే పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతు సంఘం నాయకులు చిట్టెం ఆదినారాయణ, సన్న చిన్న కారు రైతు నేత సుద్దపల్లి, సత్యనారాయణ, పటేల్ తమ అభిప్రాయాలను వెలబుచ్చారు. ఈ సమావేశంలో సుమారుగా 150 మందికి పైగా రైతులు హాజరయ్యారు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పంట రుణాల రుణమాఫీ రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తామని ప్రకటించడం పట్ల రైతులు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశానికి వెంకటాపురం ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు చిడేoమోహన్రావు అధ్యక్షత వహించారు. ములుగు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయచంద్ర వ్యవసాయ విస్తరణ శాఖ అధికారి శ్యాం కుమార్, సొసైటీ ముఖ్య కార్యనిర్వాహ అధికారి ఆర్ వి వి సత్యనారాయణ, డి సి ఓ కార్యాలయం నుండి చంద్రశేఖర్ తోట పూర్ణ, సుధారాణి, మరియు పెద్ద సంఖ్యలో రైతులు రైతు భరోసా అభిప్రాయ సేకరణ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు