పాలడుగు నాగార్జున కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి డిమాండ్.
పాలడుగు నాగార్జున కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి డిమాండ్.
నల్లగొండ జిల్లాలో సంక్షేమ హాస్టళ్లకు పక్కా భవనాలు నిర్మించి ఇవ్వాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు. ఈరోజు కెవిపిఎస్ నకిరేకల్ కమిటీ ఆధ్వర్యంలో నకిరేకల్ పట్టణ కేంద్రంలో సంక్షేమ హాస్టలను పరిశీలించి విద్యార్థినీ విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ప్రభుత్వాలు పాలకులు మారిన సంక్షేమ హాస్టల్లో తీరు మారలేదని వానొస్తే వలవల ఎండోస్తే గలగల తీరుగా ఉందని అన్నారు. జిల్లాలో సంక్షేమ హాస్టళ్లకు పక్కా భవనాలు లేకపోవడం వలన అరకొర సౌకర్యాలతో విద్యార్థినీ విద్యార్థులు అసౌకర్యాలకు గురై అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల ద్వారా ప్రతి మండలంలో సంక్షేమ హాస్టల్లో నిర్మించి ఇవ్వొచ్చని తెలియజేశారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి మల్లిస్తూ తమ స్వార్ధ ప్రయోజనాలకు పాలకులు వాడుకుంటున్నారని తెలిపారు. సంక్షేమ హాస్టల్ లో మెనూ సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాత్రి వాచ్మెన్లు స్వీపర్లు వంట మనుషుల కొరత తీవ్రంగా ఉందని తెలిపారు. సంక్షేమ హాస్టళ్లకు మ్యాట్రిన్లు వార్డెన్లను ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని అన్నారు. ఒకరికి రెండు మూడు హాస్టల్లో పరిస్థితి మారాలన్నారు. సంక్షేమ హాస్టల్లో వద్దనే నివాసముండి విద్యార్థినీ విద్యార్థులను కంటికి రెప్పలా చూడాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందని తెలిపారు.
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా అన్ని సంక్షేమ హాస్టల్లో సర్వేలు నిర్వహించి సమస్యలపై పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేయనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఒంటెపాక కృష్ణ జిల్లా కమిటీ సభ్యులు చిలుముల రామస్వామి, అరవింద్, జమదగ్ని, తదితరులు పాల్గొన్నారు.