శ్రీవాణి హై స్కూల్ విద్యార్థి మొహమ్మద్ అబ్దుర్ రహ్మాన్ సిధ్ధీఖ్
సంగారెడ్డిలోని DSAస్విమ్మింగ్ ఫూల్ లో రాష్ట్ర స్థాయి ఈత పోటీలకు ఎంపిక నిర్వహించారు
ఈ నెల 13,14 తేదీలలో సికింద్రాబాద్ GHMC లో జరిగే 9వ రాష్ట్ర జూనియర్ మరియు సబ్ జూనియర్ ఈతల పోటీలకు పాల్గొనే క్రీడాకారులకు సంగారెడ్డి పట్టణంలోని DSAస్విమ్మింగ్ ఫూల్ లో బాల బాలికలకు ఈతల పోటీలు నిర్వహించారు…
స్విమ్మింగ్ కోచ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీహెచ్ఈఎల్ పిఈటి శశి కుమార్ పర్యవేక్షణలో జరిగిన ఈతల పోటీలను జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కోశాధికారి జావిద్ అలీ ప్రారంభించారు…

అండర్ 14 ఫ్రీ స్టైల్ లో మొదటి స్థానం లో నిలిచిన మహమ్మద్ అబ్దుర్ రెహమాన్, రెండు స్థానంలో నిలిచిన మోక్షిత్ , అండర్11 మొదటి స్థానంలో నిలిచిన మహమ్మద్ ఉజేర్, రెండు స్థానంలో విన్సెంట్, గర్ల్స్ ఫ్రీ స్టైల్ లో అలియా ఫాతిమా తోపాటు జిల్లా స్థాయిలో వివిధ విభాగాలలో విజేతగా నిలిచిన క్రీడాకారులందరికీ
అభినందనలు తెలిపిన జిల్లా ఒలంపిక్స్ అసోసియేషన్ కోశాధికారి జావిద్ అలీ.
ఈ కార్యక్రమంలో పవన్, స్విమ్మింగ్ పూల్ సిబ్బంది క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు