వరదల వల్ల నష్టపోయిన ప్రతి రైతుకి ప్రభుత్వ సహాయం అందించాలి
ఆదివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ మరియు ఐటీడీఏ పీవో రాహుల్ తో కలిసి అశ్వరావుపేట మండలం పెదవాగు ప్రాజెక్టు గండి పడిన ప్రాంతాన్ని సందర్శించారు అనంతరం గుమ్మడవెల్లి గ్రామంలో వరదల వల్ల దెబ్బతిన్న ఇండ్లను పరిశీలించి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు వరదల వల్ల నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు చేపట్టాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు అనంతరం దమ్మపేట మండలం కొత్తూరు గ్రామంలో గల మహిళా డిగ్రీ కళాశాలలో సంబంధిత అధికారులతో వరదల వల్ల జరిగిన పంట నష్టం మరియు తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు వరదలు ముందుగా అంచనా వేసి గేట్లను తెరిచి ఉంటే ఇంత నష్టం జరిగేది కాదు అని ఇరిగేషన్ ఈ ఈ పై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రాజెక్టుకు గండిపడటానికి గల కారణాలను సమగ్ర విచారణ చేపట్టి నివేదికను సమర్పించాలని కలెక్టర్ ను కోరారు