ప్రపంచ శాంతికి కృషి చేయాలని పిలుపు
ప్రపంచ శాంతికి కృషి చేయాలని పిలుపు
ఈ69 న్యూస్/తెలుగు గళం /లండన్/ వరంగల్
ప్రపంచ శాంతి కోసం ప్రతీ ఒక్కరు కృషి చేయాలని అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ అధినేత మిర్జా మస్రూర్ అహ్మద్ పిలుపునిచ్చారు.లండన్ (యుకె) కేంద్రంలోని ఇస్లామాబాద్ ప్రాంతం పరిధిలోని హకీకతుల్ మహ్దీ ప్రాంగణంలో మూడు రోజుల అంతర్జాతీయ
వార్షిక మహాసభలు ఆదివారం విజయవంతంగా ముగిశాయి.ఈ సందర్భంగా ముగింపు సభలో మస్రూర్ అహ్మద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రపంచాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.ఈ మూడు రోజులలో జరిగిన సభా కార్యక్రమాలు ముస్లిం
టెలివిజన్ అహ్మదీయ టీవీ చానెల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు యావత్ ప్రపంచంలో ఉన్న అహ్మదీయులు వీక్షించారు.తెలంగాణ రాష్ట్రం లోని హైదరాబాద్,సికింద్రాబాద్,మహబూబ్ నగర్,నిజామాబాద్,ఆదిలాబాద్,ఖమ్మం,వరంగల్,నల్గొండ,కరీంనగర్ తదితర జిల్లాల్లోని అహ్మదీయులు మస్జిద్,మిషన్ హౌజ్ లలో టీవీలు స్క్రీన్ లు ఏర్పాటు చేసుకుని ప్రసారాలను వీక్షించారు.ఈ సభా కార్యక్రమాలలో కేవలం ధార్మిక అంశాలపైన ప్రసంగాలు కొనసాగినవని ఈ సభలో రెండవ రోజు సర్వ ధర్మ సమ్మేళనం కార్యక్రమం ఏర్పాటు చేసి వివిధ మతాల ధర్మాల పండితులను ఆహ్వానించి వారితో ప్రసంగాలు చేయించి ప్రపంచ శాంతికి పునాదులు వేయడం జరిగిందని అహ్మదీయులు వెల్లడించారు.ఈ మహా సభలకు 225 దేశాలకు పైగా దేశాల ప్రతినిథులు ప్రత్యక్షంగానూ,పరోక్షంగానూ పాల్గొన్నారు.