
ఈ69 న్యూస్ / తెలుగు గళం విశాఖ పట్నం
శాంతి,సౌభ్రాతృత్వాలను పెంపొందించేందుకై ‘ప్రపంచ శాంతి ఏర్పాటులో విద్యా వేత్తల పాత్ర అనే అంశం పైన ప్రసంగాలు
ఈ69 న్యూస్ / తెలుగు గళం విశాఖ పట్నం
అంతర్జాతీయ అహ్మదియ్య ముస్లిం కమ్యూనిటీ విశాఖపట్నం శాఖ మాస్టర్స్ కాలేజ్ ఆఫ్ థియాలజిలో ప్రపంచ శాంతి ఏర్పాటులో విద్యా వేత్తల పాత్ర అనే అంశం పైన సెమినార్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కాలేజీ డైరెక్టర్ మరియు మాస్టర్స్ కాలేజ్ ఆఫ్ థియాలజి ప్రిన్సిపాల్,కాలేజీ విద్యార్థులందరూ పాల్గొన్నారు.ఈ సందర్భంగా అహ్మదియ్య ముస్లిం కమ్యూనిటీ వక్తలందరూ ప్రపంచ శాంతి యొక్క ప్రాముఖ్యతను,ఆవశ్యకతను గురించి వివరించారు.మాస్టర్స్ కాలేజ్ ఆఫ్ థియాలజి సెమినార్ హాలు విధ్యార్థులు,లెక్చరర్లతో కిక్కిరిసి పోయింది.ఈ సెమినార్‌కు డైరెక్టర్ రెవ.చుగులూరి అర్జునరావు మరియు కళాశాల ప్రిన్సిపల్ రెవ.డా.హెచ్.జోసెఫ్ లాల్ఫక్మావియా అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమానికి అహ్మదియ్య ముస్లిం కమ్యూనిటీ విశాఖపట్నం అధ్యక్షులు విశిష్ట అథితిగా హాజరయ్యారు.పవిత్ర బైబిల్,ఖురాన్ కరీమ్ యొక్క వచనాల పఠనం తర్వాత అంతర్జాతీయ్య అహ్మదియ్య సంఘం యొక్క సంక్షిప్త పరిచయం మరియు ప్రపంచ శాంతికి అకాడమియా సహకారం” అనే అంశం పై ముఖ్య ప్రసంగం జరిగింది.ప్రపంచం నేడు చాలా క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నది,అహ్మదయ్య ముస్లిం సంస్థ ఒక అంతర్జాతీయ ఇస్లామీయ సంస్థగా ప్రపంచాన్ని శాంతి వైపు నడిపించడం మా ప్రథమ కర్తవ్యంగా భావిస్తుందని తెలిపారు.ఈ ఉ ద్దేశ్యంతోనే అహ్మదియ్య ముస్లిం కమ్యూనిటీ భారతదేశమంతటా,ప్రపంచవ్యాప్తంగా క్రమం తప్పకుండా శాంతి సౌభ్రాతృత్వాన్ని ప్రోత్సహించడానికి అనేక రకాల కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని వక్తలు తెలిపారు.హజ్రత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహివ సల్లం 1400 సంవత్సరాల క్రితం చేసిన భవిష్యవాణి ప్రకారం తానే వాగ్దాత్త మసీహ్ నని అహ్మదియ్య ముస్లిం సంఘ వ్యవస్తాపకులు ప్రకటించారని ధార్మిక యుద్ధాలకు ముగింపు పలికి,రక్తపాతాన్ని ఆపి, సమానత్వం,న్యాయం మరియు శాంతి స్థాపన కొరకు దేవుడు హజ్రత్ మిర్జా గులామ్ అహ్మద్‌ను పంపినాడని అహ్మదియ ముస్లింల విశ్వాసమని పేర్కొన్నారు.అహ్మదియ్య ముస్లిం కమ్యూనిటీలో దైవ కృప వల్ల ఇస్లామీయ ఖిలాఫత్(ఉత్తారికాదిత్వము) కొనసాగుతున్నదని ప్రస్తుతం వాగ్దాత్త మసీహ్ మౌఊద్ యొక్క ఐదవ ఉత్తరాధికారిగా హజ్రత్ మిర్జా మస్రూర్ అహ్మద్ అంతర్జాతీయ అహ్మదియ్య ముస్లిం సంఘానికి నాయకత్వం వహిస్తున్నారని తెలిపారు. వీరి నాయకత్వంలో ప్రపంచ శాంతి స్థాపన,మరియు సోదర భావాన్ని ఏర్పాటు చేసేందుకై సంస్థ ద్వారా విశ్వ వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ నిస్సహాయులకు,నిరుపేదలను ఆదుకుంటున్నదని అలాగే ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు సంస్థ శాఖ అయిన హ్యుమానిటీ ఫస్ట్ ఆధ్వర్యంలో సహాయక చర్యలను సెమినార్ లో డాక్యుమెంటరీ ని కూడా చూపించడం జరిగింది.అదేవిధంగా సంఘ ఐదవ ఉత్తరాధికారిగా హజ్రత్ మిర్జా మస్రూర్ అహ్మద్ మనం ఈ కాలంలో నిజంగా శాంతిని కోరుకుంటే,మనం న్యాయంగా వ్యవహరించాలి.మనం సమానత్వం,న్యాయానికి విలువనివ్వాలి.ఇస్లాం ప్రవక్తహజ్రత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహివ సల్లం ఉపదేశించిన విధంగా మన కొరకు,మనం దేనినై ఇష్టపడుతామో,దానినే ఇతరుల కొరకు ఇష్టపడాలి.ఏ విధంగానైతే మనం,మన హక్కులను పొందాలని కోరుకొంటామో అదేవిధంగా మనం ఇతరుల హక్కులను చెల్లించాలి.మన పరిధులను విస్తృతం చేసుకోవాలి.మరియు స్వంత ప్రయోజనాల ప్రాధాన్యత కంటే, ప్రపంచ ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలి.ఈ యుగంలో శాంతి సాధనాలు ఇవే అని తెలిపారని అహ్మదీయ వక్తలు తెలిపారు.ప్రపంచ శాంతి యొక్క అవసరాన్ని విద్యార్థులకు గుర్తుచేసేందుకై ఇంతటి అద్భుతమైన సదస్సును నిహ్వించి,ఒక వేదికను ఏర్పాటు చేసినందుకు అహ్మదియ్య ముస్లిం కమ్యూనిటీ చేస్తున్న ప్రయత్నాలను కళాశాల నిర్వాహకులు ప్రశంసిచారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మాస్టర్స్ కళాశాల విశాఖపట్నం ప్రిన్సిపల్ ముఖ్య అథితి అహ్మదియ్య ముస్లిం కమ్యూనిటీ విశాఖపట్నం అధ్యక్షులు షేక్ దర్గా సాహెబ్,వక్తలు అహ్మదియ్య ముస్లిం కమ్యూనిటీ కేంద్ర కార్యాలయ ప్రతినిధి సి.జీ సోహైల్,అహ్మదియ్య ముస్లిం కమ్యూనిటీ కేంద్ర కార్యాలయ ప్రతినిధి సజీల్ ఘోరీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు హమీదుల్లాహ్ హసన్,మౌల్వీ జావేద్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.