రాష్ట్ర బడ్జెట్లో రజకవృత్తిదారులకు మొండి చేయి- గోపి రజక
Hyderabadమేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి మండలం ఇందిరమ్మ ఫేజ్ – I కాలనీ కమ్యూనిటీ హాల్లో 10-8-2024 శనివారం తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి జిల్లా అధ్యక్షులు సాంబరాజు కుమార్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అడ్డాల అప్పారావు,కాలనీ అధ్యక్షులు సైనివరపు గురుమూర్తి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండల సమావేశానికి నేషనల్ ధోబి రిజర్వేషన్ సంఘ్ జాతీయ కన్వీనర్ నడిమింటి శ్రీనివాస్,తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కోడిపుంజుల చంద్రయ్య, రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిన్నరాంగారి విజయ్ గణేష్,రాష్ట్ర అధికార ప్రతినిధి ముత్యాల నర్సింగరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కేతూరి శేఖర్ ప్రసాద్, సిద్దిపేట జిల్లా కార్యదర్శి అనుమన్ల మనోహర్ ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రజక వృత్తిదారుల బతుకుల్లో వెలుగులు విరజిమ్ముతాయని చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న వారికి 10 సం.లుగా వయస్సు పెరిగిందే కానీ ఉద్యోగం రాలేదు.కనీసం రజక వృత్తిదారులకైన బడ్జెట్లో 1000 కోట్లు కేటాయించకుండా కేవలం 150 కోట్లలో 100 కోట్లు విద్యుత్ బకాయిలకు మిగిలిన 50 కోట్లు దాదాపుగా 30 లక్షల రజక జనాభకు అంటే ఒక వ్యక్తికి 166 రూ.ల చొప్పున సంక్షేమానికి కేటాయించరన్నారు. రాజకీయ నాయకులకు రజకుల ఓట్లు మాత్రమే అవసరం కానీ వారి బాగోగులు అవసరం లేదని అన్నారు.ఎన్ని ప్రభుత్వాలు మారినా రజకవృత్తిదారులకు చేసిందేమీ లేదని అన్నారు. గతంలో ఇచ్చిన కొన్ని జీవోలు అమలుకు నోచుకోవడం లేదని కేవలం పేపర్లకే పరిమితం అవుతున్నాయని వాపోయారు.రజక ఆత్మగౌరవ భవనాలు నిర్మాణం కాలేదు,141 మున్సిపాలిటీలకు 2 కోట్ల బడ్జెట్ చొప్పున 282 కోట్లు కేటాయించారు కాని ఒక్క అడుగు ముందుకు సాగలేదు.ప్రభుత్వాలు రజకుల పట్ల చిత్తశుద్ధితో పని చేయాలని లేని పక్షంలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు.