మెట్రో ట్రైన్ మూడు కోచులు ఆరు కోచులుగా పెంచండి సిపిఎం
Hyderabadనగరంలో మెట్రో రైల్ బోగీలు పెంచాలని అమీర్పేట్ మెట్రో స్టేషన్ వద్ద సిపిఎం పార్టీ హైదరాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర సెక్రటేరియట్ సభ్యురాలు నాగలక్ష్మి గారు మాట్లాడుతూ మెట్రో ట్రైన్ లో రద్దీ విపరీతంగా ఉంది. మెట్రో రైలు ఎక్కాలన్న ,దిగాలన్న ప్రయాణికులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ట్రైన్ లో నుండి దిగడం కొరకు ఒక స్టేషన్ దాటిన పోయిన తర్వాత దిగే సందర్భాలు ఉన్నాయి కావున ఇప్పుడున్నటువంటి మెట్రో కు మూడు బోగీలు ఉన్నాయి. కావున వెంటనే ఆరు భోగిలు చేయాలని సిపిఎం పార్టీ హైదరాబాద్ నగర కమిటీ డిమాండ్ చేస్తా ఉంది. ఈ ఆరు కోచులకు సరిపోయే విధంగా మెట్రో స్టేషన్ ప్లాట్ఫారం సిద్ధంగా ఉన్నాయి. అయినా కూడా కోచులు పెంచకుండా ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నటువంటి మెట్రో యజమాన్యం పైన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని మెట్రా బోగీలు పెంచే విధంగా ప్రయాణికులకు సౌకర్యం పెంచే విధంగా చూడాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు నుండి నగరంలో ఉన్నటువంటి అన్ని మెట్రో స్టేషన్ల వద్ద ఆగస్టు 13, 14 తేదీలలో కూడా సంతకాల సేకరణ చేసి 17వ తేదీన మెట్రో భవన్ బేగంపేట వద్ద ధర్నా నిర్వహిస్తామని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నగర కమిటీ సభ్యులు రాపర్తి అశోక్ , నాయకులు టి సాయి శేషగిరిరావు, జే స్వామి, బి సోమేశ్ తదితరులు పాల్గొన్నారు.