జనగామ: తెలంగాణ ఆల్ హమాలి వర్కర్స్ ఫెడరేషన్ (సిఐటియు) రాష్ట్ర 3వ మహాసభలు మిర్యాలగూడ పట్టణంలో గురువారం జయప్రదంగా జరిగాయని ఈ మహాసభలో జిల్లా నుండి నూతన రాష్ట్ర కమిటీ లో ముగ్గురికి ప్రాతినిధ్యం కల్పించినట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరు రాములు తెలిపారురాష్ట్ర కార్యదర్శిగా రాపర్తి రాజు (జిల్లా సెంటర్) రాష్ట్ర కమిటీ సభ్యులుగా అపరాధపు రాజు (చిల్పూరు) బైరగోని బాలరాజు గౌడ్ (రఘునాథ్ పల్లి) ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారుసందర్భంగా రాపర్తి రాజు మాట్లాడుతూ జిల్లాలో హమాలి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పైన నిరంతరం ఉద్యమాలు పోరాటాలు నిర్వహిస్తామని హమాలి కార్మికుల సంక్షేమం కోసం వెల్ఫేర్ బోర్డు సాధన కోసం జిల్లాలో హమాలి కార్మికులను సంఘటితం చేస్తామని రాష్ట్ర కమిటీ లో ప్రాతినిధ్యం కల్పించిన రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు