వడ్డెర వృత్తిదారులకు బడ్జేట్ లో 3వేల కోట్లు
Warangalకేటాయించాలి .. TVSS .. తెలంగాణ వడ్డెర వృత్తిదారుల సంఘం డిమాండ్,… తేదీ:25-11-2022(శుక్రవారం) ఈరోజ నయీమ్ నగర్ మెడికల్ రిఫ్రిజిన్టివ్ ఆఫీసులో వడ్డెర వృత్తిదారుల సంఘం హనుమకొండ జిల్లా సదస్సు శుక్రవారం జరిగింది .ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కార్యదర్శులు హాజరయ్యారు . ఈసందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు,రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఇడగోట్టి. సాయిలు , పల్లపు.విఘ్నేశ్ లు మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షలాది మంది వడ్డెర వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారని సామాజిక, ఆర్థిక, రాజకీయంగా బాగా వెనుకబడిన ఉంటున్నారని అయాన ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం వడ్డెర ఫెడరేషన్ కు నిధులు కేటాయించాడంలో వివక్షతను చుపిస్తూన్నారు కావున ప్రభుత్వం వెంటనే ప్రత్యేక నిధులు కేటాయించి రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కాంట్రాక్టు పన్నులో వడ్డెర కార్మికులకు ఉపాధి కల్పించాలని,జెసిబీలు, అధునాతన సాంకేతిక పనిముట్లు, వృత్తి శిక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.50 ఏండ్లు నిండిన వడ్డెర కార్మికులకు పెన్షన్ పథకం ఏర్పాటు చేయాలని, దాడులు దౌర్జన్యాలు అరికట్టడానికి ప్రత్యేక రక్షణ చట్టం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . మహాత్మ జ్యోతిబాపూలే బిసి గురుకులాల్లో వడ్డెర పిల్లలకు ప్రత్యేక కోటా కల్పించాలని. ప్రభుత్వ స్థలాల్లో ఉన్న గుట్టలు కొండలు కార్పొరేట్ సంస్థలకు ఇవ్వకుండా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని. సాంప్రదాయ వృత్తి’ దారులకే హక్కు కల్పించాలని కోరారు. చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ కాడబోయిన లింగయ్య. జిల్లా నాయకులు గొడుగు.వెంకట్ మాట్లాడుతూ జిల్లాలో వడ్డెర వృత్తిదారులు వేరాదిమంది వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు వృత్తి కోల్పోయి పనిలేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని అన్నారు సమస్యల పరిష్కారం కోసం వృత్తిదారులంతా ఐక్య సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
సంఘం జిల్లా కమిటీ ఎన్నిక జిల్లా నూతన కమిటీని 15 మందితో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కన్వీనర్ గా బొంత కొమురెల్లి కోకన్వీనర్లుగా శివరాత్రి చందర్ ఒరుసు సోమయ్య వల్లపు లక్ష్మణ్. కమిటీ సభ్యులుగా ఆలకుంట యాకయ్య వల్లపు లింగమూర్తి వల్లపు విజయ్ కుమార్ సూర నరేష్ వరి కొప్పుల రవి బొంత సంపత్ సూర దేవేందర్ శివరాత్రి రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో ఎల్లయ్యi యాకయ్య చిరంజీవి.శివరాత్రి అక్కయ్య వల్లపు సమ్మయ్య సాంబరాజు తదితరులు పాల్గొన్నారు. ఇట్లు బొంత కొమురెల్లి జిల్లా కన్వీనర్ వడ్డెర వృత్తిదారుల సంఘం