ఎర్రగడ్డ ప్రభుత్వ మెంటల్ హాస్పిటల్ లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ వర్కర్స్ కు జీతాలు జీవో 60 ప్రకారం 15,600 ఇవ్వాలి ,కానీ కాంట్రాక్టర్ నెలకు 11,000 మాత్రమే ఇస్తున్నారు. కావున వెంటనే జీవో ప్రకారం వేతనాలు ఇప్పించాలని మరియు యూనిఫామ్స్ సంవత్సరానికి రెండు చేతులు ఇవ్వాలి ఒక జత కూడా సరిగా ఇవ్వలేదు మరియు ప్రతినెల జీతం ఏడవ తేదీ లోపు ఇవ్వాలని ఈ.ఎస్.ఐ పీ.ఎఫ్ కటింగ్ అవుతున్నాయి గానీ కార్మికుల అకౌంట్లో జమ చేయటలేదు అక్టోబర్లో పనిచేసిన జీతం ఈనెల ఇప్పుడు 25 అయింది ఇప్పటివరకు వేయలేదు పై సమస్యలను పరిష్కరించాలని సూపర్డెంట్ ఆర్ ఎం ఓ గారిని కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాపర్తి అశోక్ ,ప్రధాన కార్యదర్శి ఎన్ సైదయ్య, అమెందర్, మల్లేష్, యాసిన్ ,శ్రీధర్ ,పుష్ప ,పద్మ, సరిత, తదితరులు పాల్గొన్నారు