72 కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు వెంటనే అలాట్మెంట్
Hyderabadబండ్లగూడ మండలం జంగంమేట్ MCH క్వార్టర్స్ లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇల్లు 72 కుటుంబాలకు వెంటనే అలాట్మెంట్ చేయాలని హైదరాబాద్ కలెక్టర్ గారికి విన్నవించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి కృష్ణ నాయక్ మాట్లాడుతూ…. పేద ప్రజలకు నివాసం ఉన్నా స్థలాన్ని తీసుకొని డబుల్ బెడ్ రూమ్ ఇల్లు 16నెలలో కట్టిస్తాం అని ఆశ కలిగించి 10సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికి అధికారులు చుట్టూ తిప్పుతున్న పరిస్థితి ఉంది కనీసం ఇప్పటికైనా 72 కుటుంబాలకు అలాట్మెంట్ చేయకుండా ఇప్పటివరకు నిర్లక్ష్యం చేశారు. కనీసం ఇప్పుడైనా వెంటనే అలాట్మెంట్ చేసి పేద ప్రజలకు న్యాయం చేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి గారికి విన్నవించుకోవడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు నెల లోపు 72 కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు వెంటనే అలాట్మెంట్ చేస్తామని హామి ఇచ్చిన హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి
గతంలో అధికారులు నిర్లక్ష్యం వల్ల పేద ప్రజలకు అన్యాయం జరిగిందని ఇప్పటికైనా న్యాయం చేసే విధంగా జిల్లా కలెక్టర్ చూడాలని ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం పార్టీ జిల్లా నాయకులు కిషన్ రామ్ కుమార్ శ్రీను మరియు బాధితులు సంగీత పర్వతమ్మ రేణుక పద్మ సువర్ణ రేణుక తదితరులు పాల్గొన్నారు.