ఆదివాసీల నివాస గృహాల పై అటవీ అధికారులు
దుమ్ముగూడెం: పోడు భూముల విషయంలో ఆదివాసులకు అటవీ అధికారులకు మధ్య నిత్యం సమస్యలు వస్తూనే ఉన్నాయి. ఇటీవలనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మండలంలో పోడు భూముల సమస్యలపై ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి స్వయంగా క్షేత్ర దర్శనానికి వెళ్లి ఆదివాసి పోడు భూముల సమస్యలపై అధికారులతో చర్చించడం జరిగింది అయినప్పటికీ సమస్య మళ్లీ కొత్త రూపంలో ఆదివాసి నివాస గృహాలు తొలగించాలి అని అటవీ అధికారులు ప్రయత్నించడంతో మళ్లీ వివాదం మొదలయ్యింది. మండలంలోని గడ్డూరి గట్ట గ్రామంలో కొన్ని కుటుంబాలు ఈ విషయంలో ఆందోళన చెందుతున్నాయి. ఈ సమస్యపై స్పందించిన మాజీ స్థానిక ఎంపీటీసీ భీమరాజ్ గడ్డూరిగట్ట గ్రామాన్ని సందర్శించి గత 20 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న ఆదివాసి కుటుంబాలను ఖాళీ చేయించే ప్రయత్నం సబబు కాదని, ఆదివాసులపై అటవీ అధికారుల దౌర్జన్య వైఖరి మారాలని ఆయన హితవు పలికారు. అధికారులు స్పందించి ఆదివాసి కుటుంబాలకు న్యాయం చేయాలని ఆయన కోరారు