స్టేషన్ ఘనపూర్ ఆర్డీవో కార్యాలయంలో చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు
తెలుగు గళం స్టేషన్ ఘనపూర్
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ డివిజన్ కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో తెలంగాణ పోరాట వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా స్టేషన్ ఘనపూర్ రెవెన్యూ డివిజనల్ అధికారి డిఎస్ వెంకన్న చాకలి ఐలమ్మ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.