ఆకేరు వాగు వరద ముంపుకు గురైన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఉల్లేపల్లి గ్రామ ప్రజలకు మేము సైతం అండగా ఉంటామని సాయి అక్షిత ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండి సిహెచ్ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో వరద బాధితులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.అనంతరం ఎండి రాజ్ కుమార్ మాట్లాడుతూ ఉల్లేపల్లి గ్రామానికి ఆకేరు వాగు వరదతో అపార నష్టం జరిగిందని,జరిగిన నష్టాన్ని పూడ్చలేనంతగా రైతులు కట్టు బట్టలతో మిగిలారాన్నారు.జరిగిన ఘటన చాలా బాధాకరమని ఇంకా దాతలు ఎవరైనా ఉంటే కష్టకాలంలో ఉన్న ఉల్లెపల్లి గ్రామ ప్రజలను ఆదుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో చిదుముల తిరుమలేష్,గంట శ్రీనివాస్,పాండురంగ,మాజీ సర్పంచ్ ప్రభాకర్,కిరణ్,వేంకట్ మల్లు,రమేష్, మూర్తి,ప్రణయ్,వినయ్ ఇంకా తదితరులు పాల్గొన్నారు.