bahdradri kothagudem news
వినాయకచవితి సందర్భంగా అన్నదానం కార్యక్రమం ప్రారంభం
కాంగ్రెస్ నాయకుని పరామర్శ
గళం న్యూస్ భద్రాద్రి జిల్లా.
ములకలపల్లి మండలంలో పలు గ్రామాలలో ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసి ప్రస్తుత వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే
జారె ఆదినారాయణ అనంతరం రామాంజనేయపురం గ్రామంలో వినాయక చవితి సందర్భంగా పూజా కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి
భక్తులతో నిమర్జన కార్యక్రమంలో పాల్గొన్నారు.
తరువాత కాంగ్రెస్ పార్టీ నాయకులు వేముల రోశయ్య అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొంది ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్న వారిని పరామర్శించారు..
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు, స్థానిక నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.