-ముఖ్య అతిథిగా పాల్గొని క్యాంప్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు గళం న్యూస్ జయశంకర్ భూపాలపల్లి గణపురంభూపాలపల్లి నియోజకవర్గం గణపురం మండలం ధర్మారావుపేట గ్రామంలో జీఎస్ రావు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయగా, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొని, ఉచిత మెడికల్ క్యాంప్ ను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని, ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా ఆరోగ్య స్థితిగతులపై టెస్ట్ లు చేయించుకోవాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అలాంటి వాతావరణం కల్పించేందుకే ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే జీఎస్సార్ కు డాక్టర్లు కంటి, బీపీ పరీక్షలు చేశారు. గ్రామంలోని సుమారు 250 మందికి డాక్టర్లు, సిబ్బంది కంటి పరీక్షలు, బీపీ, షుగర్, ఈసీజీ, బ్లడ్ శాంపిల్ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.